దాద్రి ఘటన నిందితుని మృతి

RAVI
Ravi (File)

దాద్రి ఘటన నిందితుని మృతి

 
న్యూఢిల్లీ: దాద్రిలో గోమాంసం తిన్నారనే కారణంతో మొహమ్మద్‌ అల్లాక్‌ అనే వ్యక్తిపై దాడి హత్యచేసిన సంఘటనలో నిందితుడు , జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న రాబిన్‌ ఆలియాస్‌ రవి (20) ఇక్కడి ఒక ఆసుపత్రిలో మరణించాడు. అతడికి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు వైషల్యానికి గురయ్యాయని, వైద్యులు తెలిపారు. తనకు నొప్పిగా ఉందని రవి చెప్పగానే జైలుఅధికారులు ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. రోగి మధ్యాహ్నం 12 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి అతడి ఆరోగ్యం బాగా క్షీణించిందని ,మూత్రపిండాలు వైఫల్యంతోపాటు, షుగరు శాతం గణనీయంగా పెరిగి పోయిందని, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని రాత్రి 7 గంటలకు మరణించినట్టు ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.