దాచేపల్లిలో 144 సెక్షన్

Guntur Rural SP Appla Naidu
Guntur Rural SP Appla Naidu

దాచేపల్లిలో 144 సెక్షన్ కొనసాగుతోందని రూరల్‌ ఎస్పీ చెప్పారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. దాచేపల్లిలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అన్నారు. అయినా 144 సెక్షన్ కొనసాగుతోందని చెప్పారు. నిందితుడు సుబ్బయ్యను త్వరలో పట్టుకుంటామన్నారు. అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు పోలీస్ గస్తీ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.