దాచేపల్లిలో మరో దారుణం

Rape on Minor
Rape on Minor

దాచేపల్లిలో మరో దారుణం

దాచేపల్లి,: గుంటూరుజిల్లా దాచేపల్లిలో మరో దారుణం వెలుగు చూసింది.గత నెల చిన్నారిపై అత్యాచారం జరిగి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టంచిన సంఘటన మరువక ముందే మరొక 14సంవత్సరాల మైనర్‌ బాలికపై అత్యాచారం జరిపి 3నెలల గర్భ వతిని చేసి ఎవ్వరికైనా చెబితే చంపుతానని మాజీఎంపిటిసీ షేక్‌మైబువలిమైనర్‌ బాలికను బెదిరించిన సంఘటన శనివారం వెలుగు చూసింది. వివరాల ప్రకారం దాచేపల్లి జలకడుగు బజారుకు చెందిన చెందిన మాజీ ఎంపిటిసి కో ఆప్షన్‌ మెంబర్‌గా వ్యవహారిస్తున్న షేక్‌మైబువలి మసికట్టు వ్యాపారం చేస్తుంటాడు. ఈవ్యాపారంలోకి పనులు చేయడానికి శాలివాహన బజారుకు చెందినవారు వస్తుంటారు.ఈక్రమంలో శాలివాహన బజారుకు చెందిన 14 సంవత్స రాల చిన్నారితో మైబువలి మాయమాటలు చెప్పి సన్నిహితంగా వుంటూ చిన్నారిపై అత్యాచారానికి పాల్సడటం జరిగింది. ఈవిషయానిన ఎవ్వరికైనా చెబితే చంపుతానంటూ చిన్నారిని బెదిరించడం జరిగింది.చిన్నారి అనారోగ్యం పాలవడంతో వైద్యశాలకు పరీక్షల నిమిత్తం తీసుకెళ్లగా చిన్నారి మూడునెలల గర్జవతిగా నిర్ధారిం చడం జరిగింది.విషయం తెలుసుకొన్న చిన్నారి తల్లిదండ్రులు స్దానిక పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలంటూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని వేడుకొన్నారు.స్దానిక ఎస్‌ఐ నిందితుడుని అదుపులో తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.