దసరాకు అదనపు బస్సులు

BUSes
BUSes

హైదరాబాద్‌ : దసరా పండుగ సందర్బంగా వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులను నడుపుతామని టిఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతోపాటు ఆంద్రా, ముంబాయి, బెంగళూరు, చెన్నై, పూణే ప్రాంతాలకు ప్రత్యేకంగా ఈబస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. స్పెషల్‌ సర్వీసులకు 50్ఞ% అదనంగా ఛార్జీలు వసూలు చేస్తామని వారు చెప్పారు. కాగా ఈనెల 9 నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతున్న సందర్బంగా 8వ తేదీ సాయంత్రం నుంచే రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతామని వెల్లడించారు. ఈనెల 13, 14 తేదీలతోపాటు 19న కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నడిపేందుకు సిద్దం చేశామన్నారు. ఈ పండుగ సందర్బంగా 4480 బస్సులను అదనంగా తిప్పుతున్నామని చెప్పారు. తెలంగాణ జిల్లాలకు ఎక్కువ సర్వీసులు నడుపుతామన్నారు. ఓపిఆర్‌ఎస్‌ ఆధారంగా అదనపు బస్సులను ఇంటర్‌స్టేట్‌లకు నడుపుతామని తెలిపారు. ప్రయాణీకులు రిజర్వేషన్‌ చేసుకుని ప్రయాణాలు ప్లాన్‌ చేసుకోవాలని అర్టీసీ అధికారులు సూచించారు. రద్దీ తగ్గించేందుకు నగర శివార్ల నుండి ఈ సర్వీసులను నడిపిస్తామని వారు స్పష్టం చేశారు. వరంగల్‌, యాదిగిరిగుట్ట నుంచి వచ్చే బస్సులు ఉప్పల్‌ వరకే నడుస్తాయని, ఉత్తర తెలంగాణ సర్వీసులను జేబిఎస్‌కే పరిమితం చేస్తామని ఆర్టీసీ అధికారులువెల్లడించారు. రాయలసీమకు సీబిఎస్‌ హ్యాంగర్‌ నుండి నడిపే వాళ్లమని కానీ అది పడిపోయినందున ఎంజీబిఎస్‌ నుంచి అపరేట్‌ చేస్తామన్నారు. కాచీగూడ బస్టాండ్‌ నుండి స్పెషల్‌ బస్‌లను నంద్యాల, కడప, చిత్తూరు, నందికొట్కూరు ప్రాంతాలకు నడుపుతామని చెప్పారు. నల్గొండ జిల్లా బస్సులను దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి, విజయవాడ రూట్‌ బస్సులు కూడా ఎంజీబిఎస్‌ నుంచి కాకుండా నగర శివార్ల నుంచి, కొన్ని ఆంధ్రా ప్రాంత సర్వీసులు ఎల్‌బినగర్‌ నుంచి, తిరుపతికి ఎంజీబిఎస్‌ నుంచి నడుపుతామని వారు తెలిపారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో ఎంజీబిఎస్‌ నుంచి సిటీ బస్సులను నగర శివార్లకు నడుపుతామని పేర్కొన్నారు. సమాచారం లేక ఎంజీబిఎస్‌కు వచ్చేవారు ఈ బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. బెంగుళూరు నుంచి వచ్చివెళ్లే వారికోసం 90 బస్సులు అదనంగా సిద్దం చేశామని టిఎస్‌ఆర్టీసీ అధికారులు వివరించారు.