దళిత మహిళపై దాడి ఘటనలో టిడిపి నేతల అరెస్ట్‌

Arrested
Arrested

విశాఖ(పెందుర్తి): జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్ర చేసి, దాడి చేసిన ఘటనలో టిడిపి నాయకులను పెందుర్తి పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఈ నెల 20న జెర్రిపోతులపాలెం దుర్గమ్మ అనే దళిత మహిళపై టిడిపి నేతలు దాడి నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక విచారణ అధికారి ప్రవీణ్కఉమార్‌ విచారణ జరిపారు. జాతీయ ఎస్సీ,ఎస్టీ కమీషన్‌ సభ్యులు రాములు కూడా ఘటన స్థలానికి చేరుకొని విచారించారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన వైస్‌ ఎంపిపి మడక పార్వతి, ఆమె భర్త మడక అప్పలరాజు, ఒడిశల శ్రీను, సోలావు జోగారావు, రాపర్తి గంగరాజు, సాలాపు గంగమ్మ, మడక రామూనాయుడులపై 354, 323 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అనంతరం సాయంత్రం 4గంటలకు కోర్టులో హాజరుపరిచారు.