దళితుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం: మంత్రి ఈటల

కరీంనగర్: మానకొండూరు నియోజకవర్గంలో జరిగిన దళిత యువకుల ఆత్మహత్యాయత్నం ఘటన కేవలం అపోహ వల్ల
జరిగిందే తప్ప ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా కాదని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందరు తెలిపారు. అల్గనూర్లోని
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంపు కార్యాలయం ముందు ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, బెజ్జంకి మండలం
గుడూరులో ఉన్న గ్రూపుల కారణాంగానే ఈ ఘటన జరిగిందని, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు.
దేశంలో దళితులు, బీసీలు, మైనార్టీల కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ తెరాసనేని అన్నారు. చల్లూరులో ఒక దళిత యువతిపై
ఆత్యాచారం జరిగితే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 20నెలలు తిరగక ముందే నిందితులకు 20ఏళ్ల జైలుశిక్ష పడేలా చర్యలు
తీసుకున్నామని, దళితుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు
చేస్తున్నాయని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.