దర్శిని ఉత్తమ నియోజకవర్గం దిశగా కృషి: మంత్రి శిద్ధా

Siddha Raghavarao
Siddha Raghavarao

ప్రకాశం: దర్శిలో రూ.1.600 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు.
నేడు దర్శి నియోజకవర్గ పరిధిలో గల దొనకొండ మండలంలో ఇంటింటికి టిడిపి కార్యక్రమం నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఇంటింటి టిడిపి కార్యక్రమం నిర్వహిస్తున్నాం
అన్నారు. రాష్ట్రంలో వేలకోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, దర్శి ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు
చర్యలు తీసుకుంటానని మంత్రి శిద్ధా వెల్లడించారు.