దర్శకేంద్రుడు ప్రశంస

Raghavendra rao
Raghavendra rao

ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ గారి కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు కలిసి నిర్మించిన చిత్రం ‘మహానటి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొదటి ఆట నుండే మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంటోంది. ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి సినిమాను పొగడగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడ చిత్రాన్ని ప్రశంసించారు.28 ఏళ్ల క్రితం మే 9న అశ్వినీ దత్ తన దర్శకత్వంలో నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలైందని, మళ్ళీ ఇదే రోజున ‘మహానటి’ విడుదలైందని, ఆరోజున ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో నేడు ‘మహానటి’ని నిర్మించడానికి కూడ అంతే ధైర్యం కావాలని అన్నారు. అలాగే సావిత్రిగారి చరిత్రను తరతరాలకు అందించిన వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ కు ధన్యవాదాలని, కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ ల నటన అద్భుతమని కొనియాడుతూ నాగ్ అశ్విన్ మరియు చిత్ర టీమ్ సభ్యులకు అభినందనలు తెలిపారు.