దర్శకుడి భార్య సింగర్‌గా..

ISWARYA-22
ISWARYA

దర్శకుడి భార్య సింగర్‌గా..

మ్యాచోమాన్‌ గోపీచంద్‌ చేసిన చిత్రాలోల విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం జ్యోతికృష్ణ డైరెక్టు చేసిన ‘ఆక్సిజన్‌. షూటింగ్‌ ఆలస్యం కావటం వల్ల ఇన్నాళ్లు వాయిదాపడుతూ వచ్చిన ఈచిత్రం ఎట్టకేలకు దీపావళి కానుకగా అక్టోబర్‌12న విడుదల కానుంది.. ఈచిత్రం కోసం దర్శకుడు జ్యోతికృష్ణ భార్య ఐశ్వర్య గాయనిగా మారారు.. స్వతహాగా మంచి గాత్రం కలిగిన గాయత్రి పలు అవకాశాలు వచ్చినా పాడలేదు.. కానీ జ్యోతికృష్ణ సలహా మేరకు ఈచిత్రంతో సింగర్‌గా అరంగేట్రం చేస్తున్నారామె. ఈ ఆల్బమ్‌లో ఐశ్వర్య రెండుపాటల్ని పాడారట.. వాటిలో ఒక ఫ్యామిలీ సాంగ్‌ కూడ ఉందట.. ఇప్పటికే పాటల రికార్డింగ్‌ కూడ పూర్తయిందని, పాటలు ప్రేక్షకులకు తప్పప నచ్చుతాయని జ్యోతికృష్ణ అన్నారు.. యువన శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటించారు.