‘దర్శకరత్నకు సినీ జన నీరాజనం

This slideshow requires JavaScript.

‘దర్శకరత్న’కు సినీజన నీరాజనం

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబఢాశ్చర్యముతో వీరు, నెత్తురు కక్కుంటూ నేలకు నేరాలిపోతే నిర్ధాక్ష్యంగా వీరే, మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ మాటలు గెలుపు ఓటుముల బాటలో సాగే ప్రతిఒక్కరికి వర్తిస్తాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితం కూడా గెలుపోటముల ఊగిసిలాటే కానీ కష్టపడి సాధించిన గెలుపుని, గెలుపు విలువ తెలిపే ఓటమిని సమానంగా స్వీకరించి సినీవీనాకాశంలో ధృవతార వలే ఓ వెలుగు వెలిగారు. ఎందరో నటీనటుల్ని, దర్శకనిర్మాతల్ని, ఇతర ఇతర సాంకేతిక నిపుణుల్ని ఎందరినో తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. సినిమాకి కథే హీరో, హీరో కేవలం కథలో పాత్ర మాత్రమే అనే సూత్రాన్ని తూఛ తప్పకుండా పాటించే దర్శకుల్లో దాసరిదే అగ్ర తాంబుళం. 40 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమకి సేవలందించిన దాసరి, దాదాపు 151 చిత్రాలకి దర్శకత్వం వహించారు, 53 చిత్రాల్ని నిర్మించారు, రెండు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. తొమ్మిది బంగారు నందుల్ని సొంతం చేసుకున్నారు.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కష్ణ, శోభన్‌ బాబు, కష్ణంరాజు, చిరంజీవి, బాలకష్ణ, వెంకటేశ్‌, నాగార్జున, మోహన్‌ బాబు, శ్రీదేవి, జయసుధ, జయప్రధ, రాధ, రంభ, రమ్యకష్ణ, విజయశాంతి ఇలా ఎందరో స్టార్‌ హీరోలతో సినిమాలు తీశారు దాసరి. తెరవెనుకనే కాదు తెర పై కూడా దాదాపు 54 సినిమాల్లో కనిపించారు దాసరి. ఇవన్నీ ఓ ఎత్తుతే చిత్రపరిశ్రమ బాగోగులు చూసుకునే పెద్దగా, వర్థమాన తరాలకి గురువుగా కీలక బాధ్యతలు నిర్వహించారు నారయణరావు. చిన్న సినిమాలకి పెద్ద దిక్కుగా దాసరి అందించిన సేవలు కొనియాడని వారు చిత్ర సీమలో ఉండరు. దాసరి తీసిన తాతమనవడులో గిరి అమాయకత్వం చూసి వచ్చే నవ్వు చెరగని వరకు, మేఘసందేశంలో రవీంద్రబాబు చెప్పే కవితలకి మనసు పులకించడం ఆగనంత వరకు, సృజనకి జోహర్లు పలికే అభిమానులు ఉన్నంతవరకు దాసరోడు చిరంజీవే.

దాసరి కడచూపుకు పోటెత్తుతున్న అభిమానులు.. కళామతల్లి ముద్దుబిడ్డను కడసారి చూసేందుకు సినీ పరిశ్రమ మొత్తం తరలి వస్తోంది. దాసరినారాయణరావు మంగళవారం రాత్రి ఏడుగంటల సమయంలో నగరంలోని కిమ్స్‌ ఆసుపత్రిలో మరణించారు. అక్కడ్నించి ఆయన భౌతిక దేహాన్ని జూబ్లీహిల్స్‌ లోని అతని స్వగృహానికి తరలించారు. అప్పట్నించి దాసరిని చివరి చూపు చూసేందుకు సిని ప్రముఖులు, అభిమానులు తరలి వస్తూనే ఉన్నారు. ఒక మోహన్‌ బాబు… ఏడుస్తూ రాత్రి నుంచి దాసరి భౌతికకాయం వద్దనే ఉన్నారు.

కె.విశ్వానాథ్‌, త్రివిక్రమ్‌, పవన్‌ కళ్యాణ్‌ , జగపతిబాబు, మంచు విష్ణు, కవిత, సుమ కనకాల, రాజీవ్‌ కనకాల, నారా రోహిత్‌, టి.సుబ్బిరామిరెడ్డి , నరేష్‌, అల్లు అర్జున్‌ పలువురు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు, అనేక మంది సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. దాసరి మృతికి సంతాప సూచకంగా ఈ రోజు అన్ని సినిమా షూటింగ్‌ లు క్యాన్సిల్‌ అయ్యాయి. థియేటర్లు కూడా మూతపడ్డాయి. ఆయన స్వస్థలం అయిన పాలకొల్లులో స్వచ్చందంగా ప్రజలు బంద్‌ పాటిస్తున్నారు. దుకాణాలన్నీ మూసివేశారు.

వ్యక్తిగతంగా లోటు: పవన్‌ కల్యాణ్‌

దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని అన్నారు సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. దాసరి భౌతిక కాయానికి నివాళిఘటించిన అనంతరం పవన్‌ మాట్లాడుతూ దాసరితో తన సాన్నిహిత్యాన్ని ప్రస్తావించారు. దాసరి సినీ రంగానికి సేవలను గుర్తు చేసుకున్నారు. దాసరి మరణం పరిశ్రమకే కాక తనకు వ్యక్తిగతంగా కూడా తీరని లోటు అని అన్నారు. దాసరి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అన్నారు పవన్‌. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తో కలిసి వచ్చి పవన్‌ దాసరికి నివాళి ఘటించారు. దాసరి మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. దాసరి భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం తారక్‌ మాట్లాడుతూ.. తెలుగు కళామతల్లి కన్న దిగ్గజం దాసరి నారాయణ రావు అన్నారు. దాసరిని ఆదర్శంగా తీసుకుని చిత్రపరిశ్రమ ముందుకు సాగాలని తారక్‌ అన్నారు. మరో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ కూడా దాసరి భౌతిక కాయానికి నివాళి ఘటించారు. దాసరి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ సతీసమేతంగా దాసరికి నివాళి ఘటించారు. నటుడు నాగబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు, వైకాపా నేత అంబటిరాంబాబు, నటుడు తనికెళ్ల భరణితో సహా అనేక మంది ప్రముఖులు దాసరి భౌతిక కాయానికి నివాళి ఘటించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని వివరిస్తూ స్మరించుకున్నారు.

దాసరి మరణం షాక్‌కి గురిచేసింది: చిరంజీవి!

దర్శకరత్న దాసరిగారి అకాల మరణ వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నా అన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి. ఇటీవలే ఆయన ఆనారోగ్యం కారణంగా అల్లు రామలింగయ్య గారి అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నా చేతు మీదుగా అందజేశాను. ఆ సమయంలో ఆయనతో చాలా సేపు మాట్లాడటం జరిగింది. చాలా ఆరోగ్యంగా నాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను చైనాలో ఉన్నాను ఇంతలో ఇలాంటి చేదు వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం యావత్తు చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. దర్శక నిర్మాతగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు అనీర్వచనీయం. ఇప్పటివరకూ తెలుగు సినిమాకు పెద్ద దిక్కులా ఉన్న ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం భాదాకరం. భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన సేవలను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటానన్నారు చిరంజీవి. మరోవైపు రామ్‌ చరణ్‌ కూడా దాసరి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు దర్శకరత్న డా? దాసరి నారాయణరావు గారి మరణం యావత్త్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.

కంటతడి పెట్టిన మోహన్‌ బాబు

దాసరి మరణవార్తతో కన్నీరు మున్నీరయ్యారు సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు. ఇండwస్టీలో నాకు నటుడిగా భిక్షపెట్టిన దాసరి మరణాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నానని.. తాను ఇండwస్టీలో ఈ స్థితిలో ఉన్నానంటే అది నా గురువు గారు దాసరి ప్రసాదించిన భిక్షే అంటూ కన్నీరుతో విలపించారు మోహన్‌ బాబు! గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడంతో హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు మోహన్‌ బాబు. కాగా దాసరి నారాయణరావు ఈనెల 17వ తేదీన తీవ్ర రక్తపోటుతో కిమ్స్‌ ఆస్పత్రిలో చేరగా.. 18వ తేదీనే ఆయనకి ఓ కీలకమైన సర్జరీ జరిగింది. ఆ సర్జరీ అనంతరం కోలుకుంటున్నారని భావించినప్పటికీ ఈరోజు పరిస్థితి విషమించడంతో కిమ్స్‌ ఆసుపత్రిలో మరణించారు.

దాసరి మరణం తీరని లోటు వెంకయ్యనాయుడు!

ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణంపై తీవ్రwగ్భ్భాంతి వ్యక్తం చేశారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. దాసరి నారాయణ రావు మరణ వార్త చాలా బాధ కలిగించిందని.. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దన్నను కోల్పోయిందన్నారు. ఆయన దర్శకుడు, నటుడు , నిర్మాతగానే కాకుండా రాజకీయంగానూ తనకంటూ ప్రత్యేకమైన స్థాయిని సంపాదించారని.. కేంద్రమంత్రిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న చాలా మంది నటీనటులు ఆయన దగ్గరే ఓనమాలు నేర్చుకున్నారని చాలా మంది నటులకు నటన నేర్పించారిని.. 150 పైగా సినిమాలకు దర్శకత్వం చేయడం ఆయనకు మాత్రమే సాధ్యం అయ్యిందని అన్నారు. ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉందని.. ఆయన మరణం తీరనిలోటని, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబసబ్యులకు ఆ దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుతున్నానన్నారు.

దాసరి ఓ వ్యక్తి కాదు, వ్యవస్థ: చంద్రబాబు

దాసరి నారాయణ రావు ఓ వ్యక్తి కాదని, ఓ వ్యవస్థ అని కొనియాడారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఫిలింనగర్‌లో దాసరి భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు అనంతరం మాట్లాడుతూ.., దాసరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. దాసరి మరణం చిత్రపరిశ్రమతో పాటు తెలుగు జాతికి తీరని లోటని, సాధారణ కుటుంబంలో పుట్టి ఆయన ఉన్నత శిఖరాలకు ఎదిగారని కొనియాడారు. సినీ పరిశ్రమకు దాసరి ఎనలేని సేవలు చేశారు, తనకు చిన్నప్పటి నుండి దాసరితో పరిచయం ఉందని, తన కుటుంబంతో కూడా దాసరి సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. తెలుగు వారి గుండెల్లో ఆయన ఎప్పటికీ నిలిచిపోతారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

ఈ లోటు ఎప్పటికీ, ఎవ్వరూ భర్తీ చేయలేరు-మహేష్‌

దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిపైwగ్భ్భాంతి వ్యక్తం చేశారు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు దర్శకరత్న మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యానని, ఎంతో బాధ కలిగించిందని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు మహేష్‌? సినీ పరిశ్రమలో దాసరి లేని లోటు ఎప్పటికీ, ఎవ్వరూ భర్తీ చేయలేరంటూ ట్వీట్‌ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు మహేష్‌బాబు? కుటుంబసబ్యులకు సానుభూతి తెలిపారు.

గురువు గారిని వ్యక్తిగతంగా మిస్‌ అయ్యా: రాజమౌళి

అనారోగ్యంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించిన దర్శకరత్న దాసరి నారాయణ రావుకు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. ఆయన లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీరనిదని దాసరితో తమకు ఉన్న సంబంధాన్ని చెప్పుకుంటూ భావోద్వేగానికి లోనౌతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి స్పందిస్తూ.. దర్శకుడికి ఇండwస్టీలో ఒక గుర్తింపు తీసుకొచ్చింది దాసరి నారాయణ రావునేనని, గురువు గారిని సినీ ఇండwస్టీతో పాటు వ్యక్తిగతంగా చాలా మిస్‌ అవుతున్నానని అన్నారు.

మాటలు రావడంలేదు: విజయశాంతి

దర్శకరత్న దాసరి నారాయణరావు మృతితో సినీపరిశ్రమ శోకసంద్రమైంది? దాసరి ఇంటికి సినీ పరిశ్రమకు చెందినవారు పెద్దసంఖ్యలో వచ్చి ఆయన మృతదేహానికి నివాళులర్పించి? కుటుంబసబ్యులను ఓదారుస్తున్నారు. దర్శకరత్న మృతదేహానికి నివాళులర్పించారు విజయశాంతి? క్లోజ్‌ గా ఉన్నవాళ్లు ఒక్కొక్కరు పోతుంటూ బాధగాఉందన్నారామె? దాసరి లేరన్న విషయం తెలియగానే షాక్‌కు గురయ్యా? ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదన్నారు. ఓ గొప్ప వ్యక్తి, గొప్ప దర్శకుడు లేకపోవడం తీరని లోటు అన్నారు విజయశాంతి. తమ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఒసే§్‌ు రాములమ్మకు కొనసాగింపుగా ఒసే§్‌ు రాములమ్మ 2 తీయాలని అనుకున్నాం? చాలాసార్లు చర్చించుకున్నాం? కానీ, కొన్ని పరిస్థితుల వల్ల అది సాధ్యపడలేదన్నారు. ఆయన లేరన్న షాక్‌ తో ఏం మాట్లాడాలో తెలియడంలేదు? ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు విజయశాంతి.

మా బిల్డింగ్‌లోని హాల్‌కు దాసరి పేరు: శివాజీరాజా

దర్శకరత్న దాసరి నారాయణరావు డబ్బులు ఇస్తే మెస్‌ బిల్లు కట్టుకున్న రోజులున్నాయని గుర్తుచేసుకున్నారు మా అధ్యక్షుడు, నటుడు శివాజీరాజా? ఆయన పరిస్థితి విషయంగా ఉందని తెలిసింది కానీ, ఇంతలోనే ఇంత ఘోరం జరుగుతుందని మేం ఊహించలేదన్నారు. ఆయన లేకపోవడం దురృష్టకరమన్న శివాజీరాజా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ కట్టబోయే భవనంలోని ఓ మెయిన్‌ హాల్‌కు దాసరి నారాయణరావు పేరు పెడతామని ప్రకటించారు. దాసరితో 32 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్న శివాజీరాజా ఇంటికి వచ్చిన నటీనటులకు రూ.500, రూ.1000 ఇచ్చి పంపేవారని తెలిపారు ఆయన ఇచ్చిన డబ్బుతో తాను మెస్‌ బిల్లు కట్టిన రోజులు ఉన్నాయని గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు శివాజీరాజా పరిశ్రమలోని ప్రతి ఒక్కరినీ పిల్లల్లా చూసుకున్నారని పరిశ్రమకు గొప్ప డైరెక్టర్లు రావొచ్చు కానీ ఇలాంటి మంచి మనిషిని చూడలేమన్నారు.

సినీ పరిశ్రమ అంబేద్కర్‌ ఆయన: ఆర్‌.నారాయణమూర్తి

తెలుగు సినీ పరిశ్రమ ఓ అంబేద్కర్‌ను కోల్పోయిందన్నారు ఆర్‌. నారాయణమూర్తి.. తెలుగు సినీ పరిశ్రమలో దాసరి నారాయణరావు ఒక శఖం అన్నారాయన? సినీ పరిశ్రమ దాసరి నారాయణరావుకు ముందు.. తర్వాత అన్నట్టుగా ఉంటుందన్నారు.