దర్గాలోకి మహిళల నిషేధంపై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు..

hajrat Nizamuddin Dargah
hajrat Nizamuddin Dargah

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రముఖ ముస్లిం పవిత్ర క్షేత్రం నిజాముద్దీన్‌ దర్గాలోకి మహిళలను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ ప్రభుత్వాల స్పందన కోరింది. కేంద్ర ప్రభుత్వం ,ఢిల్లీ ప్రభుత్వంతో పాటు నిజాముద్దీన్‌ దర్గా యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఐతే శబరిమల తీర్పు తర్వాతే ఈ కేసును విచారించనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 11కి వాయిదా వేసింది. హజ్రత్‌నిజాముద్దీన్‌ దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరిస్తున్నందుకు పుణేకి చెందిన న్యాయశాస్త్ర విద్యార్ధినులు గురువారం పిటిషన్‌ దాఖలు చేసింది. ముంబైలోని హజీ అలీ దర్గా, అజ్మీర్‌లోఇ ఖ్వాజా మెయినుద్దీన్‌ దర్గాల్లో మహిళల ప్రవేశంపై నిషేధం లేదని.. ఈ దర్గాలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం వివక్ష చూపడమేనని పిటిషనర్లు ఆరోపించారు.