దత్తపంచకము

shirdi sai
shirdi sai

దత్తపంచకము

హేమాడ్‌పంత్‌ మరాఠీభాషలో సాయిబాబా సచ్చరితను మొదట ధారావాహికంగా సాయిలీల అనే పత్రికలో ప్రచురించటం జరిగింది. అయితే హేమాడ్‌పంత్‌ 52 అధ్యాయాలను మాత్రమే రచించారు. ఆయన సాయిలీల పత్రిక సంపాదకునికి పంపిన 53వ అధ్యాయం దొరకలేదు. 53వ అధ్యాయము లేకున్న సచ్చరిత సంపూర్ణముగా ఉండదని ‘సాయిలీల సంపాదకులు, సంపాదకవర్గము వారు భావించి 53వ అధ్యాయమును పునర్ణిర్మితము గావించుటకు నిర్ణయించుకొనిరి. ఈ 53వ అధ్యాయ రచనాభారము. శ్రీబాలకృష్ణ విశ్వనాధ రేవ్‌గారి భుజస్కంధములపై బడినది. ఆయన ఆ అధ్యాయమును చక్కగ కూర్చినాడు.

ఈ 53వ అధ్యాయములో ఒక ప్రత్యేక విషయాన్ని బీ.వీ.దేవ్‌గారు తెల్పుతారు. మొదటి అధ్యాయములో హేమాడ్‌పంత్‌ విఘ్ననాశకులు అయిన వినాయకుని స్తుతిస్తారు. జ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివని కీర్తిస్తారు. అంతటితో ఆయన ఆగరు. ‘ఈసాయియే గజాననుడైన గణపతి. ఈ సాయియే పరశుమను చేత బట్టుకుని, విఘ్నములను తొలగించేవారు. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారు. సాయియే బాలచంద్రజాననుడు. ఏకదంత గజకర్ణుడు వీరే. విరిగిపోయిన దంతంతో విఘ్నకానాలను విచ్ఛేదల చేసేవారు వీరే. ఓ సర్వమంగళ మంగళ్లా! లంబోదర! గణాధీశా! అఛ్‌దరూపా! సాయిదయామయా! మమ్ము ఆత్మానందనిలయానికి తీసుకొని వెళ్లండి అని వినాయకుడు, సాయి నాధుల ఏకత్వాన్ని వర్ణిస్తాడు. అలాగే ఆయన మొదటి అధ్యాయంలో సరస్వతి, సాయిబాబాల ఏకత్వాన్ని తెలుపుతారు. ‘సాయియే భగవతి. సాయియే సరస్వతి, భక్తులను ఉద్దరించటానికి, ఓంకారవీణను ధరించి తమ చరితాన్ని తామే గానం చేస్తారు అని ఆ యిద్దరి తాదార్మ్యమును తెలుపుతారు. ఇక సావితీపతి, రమాపతి, ఉమాపతులు కూడా సాయియే అని చాటిస్తారు. ఇక 53వ అధ్యాయ రచయిత కొత్త విషయాన్ని చెబుతారు. ‘దత్త గురుస్వరూపులయిన సాయినాధుని ప్రార్థించి వారి అనుగ్రహాన్ని వేడుకున్నాను..

నాకు ఒకే ఒక ఆధారం శ్రీదత్త గురువ్ఞ వారి అనుగ్రహముంటే చాలు. వారు దోమచే కురు పర్వతాన్ని లేవనెత్తించగలరు అని ఆయన రాస్తారు. బీ.వి.దేవ్‌లు దత్తాత్రేయుని సాయిగా అభిమానాన్ని తెలుపుతారు. హేమాడ్‌పంత్‌ ప్రత్యేకంగా రాయని ఆ విషయాన్ని బీ.వీ.దేవ్‌గారు రాయటం జరిగింది. సాయి సచ్చరిత గురు (దత్తాత్రేయ) చరిత్రగా రాసికెక్కింది. సాయి సచ్చరితను సంక్షిప్తంగా ఆంగ్లంలో గుహజీగారు తీసుకుని వచ్చారు. దానిని ఆధారంగా తెలుగులో శ్రీప్రత్తి నారాయణరావ్ఞగారు రచించారు. శ్రీప్రత్తివారు తన విజ్ఞప్తిలో (1953) ఇలా రాశారు. ‘వారే (సాయిబాబా) గణపతిగా స్వప్నములో నాకు దృష్టాంతమిచ్చిరి. ముందుగా తెలియపరచి, రెండవ నాడే గురుస్థానములో జపము చేయుచుండగా శ్రీశేషసాయిగా సాక్షాత్కరించారు. గ్రంథములన్నీ శోధించి సాయిబాబా శ్రీదత్తాత్రేయుని ప్రస్తుత అవతారముని మరాఠీ పండితుడగు పంగార్‌కర్‌ కనిపెట్టారు. షిరిడీ సంస్థానం వారి పూజావిధానాన్ని బట్టి వీరు (సాయిబాబా) దత్తాత్రేయులని నిర్ధారణ చేయవచ్చును అలా సాయినాధుని వలె శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహసరస్వతి, మాణిక్యప్రభువ్ఞ, అక్కల్‌ కోట మహారాజులు దత్తావతారులుగా కీర్తింపబడ్డారు. ఈ అయిదుగురే ‘దత్తపంచకము అయినారు.

– యం.పి.సాయినాధ్‌