దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్‌ విజయం

win11
win11

దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్‌ విజయం

క్రిస్ట్‌ చర్చ్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ వన్డేలో న్యూజిలాండ్‌ విజయం సాధించింది.తొలి వన్డేలో పరాజయానికి రెండవ వన్డేలో గెలుపుతో బదులిచ్చింది.అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండవ వన్డేలో సఫారీ జట్టుపై న్యూజిలాండ్‌ 6 పరుగుల తేడాతో గట్టెక్కింది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది.మొదట బ్యాటింగ్‌ చేసిన విలియమ్సన్‌ సేనకు చెందిన రాస్‌ టేలర్‌ 110 బంతులు ఆడి 8 బౌండరీలతో అజేయ సెంచరీ చేశాడు.నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది.కెప్టెన్‌ విలియమ్సన్‌ 71 బంతులు ఆడి 6 బౌండరీలతో 69 పరుగులు,నీషమ్‌ 57 బంతులు ఆడి 6 బౌండరీలతో 71 పరుగులతో నాటౌట్‌గా కొన సాగి హాఫ్‌ సెంచరీ చేయగా,సఫారీ బౌలర్లలో ప్రేటోరియస్‌ రెండు వికెట్లు, పార్నెల్‌,ఇమ్రాన్‌ తాహిర్‌ ఒక్కొక్కరు ఒక వికెట్‌ తీసుకున్నారు.

టార్గెట్‌ చేధనకు బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 11 ఓవర్లు ముగిసే సరికి అమ్లా 10 పరుగులు, డెప్లెసిస్‌ 11 పరుగుల వద్ద వికెట్లు కోల్పోయింది. డుమిని 34 పరుగులతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించిన కీపర్‌ క్వింటాన్‌ డికాక్‌ 65 బంతులు ఆడి 6 బౌండరీలతో 57 పరుగులతో హాఫ్‌ సెంచరీ చేసి ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.మిల్లర్‌ 28 పరుగులు, కెప్టెన్‌ డివిలియర్స్‌ 49 బంతులు ఆడి 2 బౌండరీలతో 45 పరుగులు చేసి స్వల్ప విరా మాల్లో వెనుదిరగడంతోసఫారీలతో టెన్షన్‌ మొద లైంది. హాఫ్‌ సెంచరీతో చివరి వరకు పోరాడిన ప్రెటోరియస్‌ 27 బంతులు ఆడి 4 బౌండరీలు,2 సిక్సర్లతో 50 పరుగులతో హాఫ్‌ సెంచరీ చేసి తొమ్మిదవ వికెట్‌కు పిహ్లూ క్వా§్‌ు 29 పరుగులతో నాటౌట్‌తో కలిసి 61 పరుగులు జోడించాడు.అయితే 49వ ఓవర్‌ చివరి బంతికి యార్కర్‌ బంతితో ప్రెటోరియస్‌ను కివీస్‌ బౌలర్‌ బోల్తా కొట్టిస్తూ బౌల్ట్‌ చేశాడు.ఆఖరి ఓవర్‌లో సఫారీల విజయానికి 15 పరుగులు అవసరం అయిన సమయంలో ఆఖరి ఓవర్‌ చివరి రెండు బంతులను ఫిహ్లూక్వాయో బౌండరీలతో తరలించడంతో డివలియర్స్‌ సేన 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 3 వికెట్లు తీసుకున్నాడు.సాంట్నర్‌ రెండు వికెట్లు,సోధీ, గ్రాండ్‌ హూమ్మీ,సౌతీ తలో వికెట్‌ తీశారు.