దంతాలు ఆరోగ్యానికి చాలా ముఖ్యం

DENTAL CARE
DENTAL CARE

దంతాలు ఆరోగ్యానికి చాలా ముఖ్యం

దంతాలకు సాధారణ శారీరక ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడమనే ప్రక్రియ ఆహారాన్ని నమలడం దగ్గరనుంచి ఆరంభమవుతుంది. అప్పుడే శరీరానికి అవసర మైన పోషకాలు సక్రమంగా అందుతాయి. దంతాలు దృఢంగా, పటిష్టంగా ఉంటేనే మనం ఆహారం తీసుకో గలుగుతాము. అన్ని రకాల ఆహార పదార్థాలను తినగలుగుతాము. ఎంతటి రుచికరమైన ఆహారం ఎదురుగా ఉన్నా, దంతాలు సహక రించకపోతే మాత్రం దానిని మనం తృప్తిగా భుజించలేము. ఆస్వాదించ లేము. ఆహారాన్ని తీసుకోలేకపోతే శరీరం నీరసిస్తుంది. తద్వారా ఆరో గ్యం దెబ్బ తింటుంది. శరీరం నీరసించడం మొదలైతే వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. తరువాత అనేక రకాల రుగ్మతలు శరీరం మీద దాడి చేస్తాయి. కనుక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే సరైన పౌష్టికా హారం తీసుకోవాలి.

ఇలా ఆహారం తీసుకోవా లంటే దంతాలు పటిష్టంగా ఉండాలి. అంటే సమస్య ఎటు తిరిగీ దంతాల దగ్గరకే చేరు తుంది. అందుకే దంతాల ఆరోగ్యాన్ని సంరక్షిం చుకోవడం అత్యవసరం. ఒక అధ్యయనంలో శారీరకంగా శుష్కించిన ఒక వృద్ధురాలిని ఆమె తీసుకునే ఆహారం గురించి ప్రశ్నిం చినప్పుడు ఆసక్తికరమైన సమా ధానం లభించింది. ఆమెకు నాలుగే దంతాలు ఉన్నాయి. అవి కూడా పుచ్చి పోయి తీసి వేయా ల్సిన స్థితిలో ఉన్న దంతాలు. ఆ దంతాలతోటే నమలడానికి ప్రయత్నిస్తూ, ఆహారాన్ని సరిగ్గా నమలకుండానే మింగుతున్నా నని ఆమె చెప్పింది.

ఫలితంగా ఆమె తీసుకో గలిగినంత ఆహారాన్ని తీసుకోకుండానే భోజ నాన్ని ముగిస్తున్నది. అంటే దంతాలు సక్రమంగా లేనందున తగినంత ఆహా రాన్ని భుజించకుండా అర్ధాకలితో భోజనాన్ని ముగిం చాల్సి వస్తుంది. దంతక్షయంతో బాధపడుతున్న వారు సరైన ఆహా రం తీసుకోలేరు. తమకు అవకాశం ఉన్నప్పటికీ శరీరా నికి పుష్టినిచ్చే యాపిల్‌ వంటి ఫలాలను తిన లేరు. ఫలితంగా శరీరం నీరసించి, నెమ్మదిగా వ్యాధి నిరోధక శక్తి సన్నగి ల్లడం ఆరంభమవు తుంది. ఇది పలు వ్యాధులు శరీరంపై దాడి చేయడానికి ఆస్కారం కల్పిస్తుంది. దంతక్షయంతో బాధ పడుతున్న వ్యక్తులు నిర్లక్ష్యం చేయకుండా ఆ సమస్యకు సరైన చికిత్స తీసుకోవాలి. కొంతమందికి పై వరుసలో, కింది వరుసలో కొన్ని దంతాలు ఉం డవు.

దీనికి పిప్పి పళ్లను తీయించుకోవడం కారణం కావచ్చు. లేదా దంతాలు బలం కోల్పోయి నెమ్మదిగా కదిలి ఊడిపోవడం కారణం కావచ్చు. అప్పుడు అక్కడ ఖాళీలు ఏర్పడుతాయి. అయితే ఆ ఖాళీలను పలువురు అలక్ష్యం చేస్తారు. ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆ ఖాళీలలో ఆహారపు తునకలు ఇరుక్కుపోతున్నా కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే రోజులు గడిచేకొద్దీ ఆ ఖాళీలకు పక్కనున్న దంతాలు ఆ ఖాళీలలోకి ఒరిగి పోయి, మరింత ఇబ్బందికి గురి చేస్తాయి. దంతాల మధ్య ఖాళీలు ఏర్పడితే వెంటనే దంత వైద్యుడిని సంప్రదిం చాలి.

దీనికి ఏ రకమైన చికిత్స రోగికి ఉపయుక్తంగా ఉంటుం దనే విషయాన్ని పరిశీలించి కేపింగ్‌ లేదా బ్రిడ్జి పద్ధతుల్లో కాని లేదా శాశ్వత కృత్రిమ దంతాలను అమర్చడం ద్వారా కాని చికిత్స చేస్తారు. శరీరం లోని ఏ అవయవానికి ఏ మాత్రం అసౌకర్యం కలిగినా అశ్రద్ధ పనిక ిరాదు. ఒకవేళ అశ్రద్ధ చేస్తే అది మరిన్ని అనారోగ్యాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా దంతాల విషయంలో అశ్రద్ధ ఏమాత్రం పనికి రాదు. దంతా లు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. దంత క్షయంతో బాధపడుతుంటే ఇతర రుగ్మతలకు గురయ్యే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.