దంతక్షయానికి కారణాలనేకం

Dental deseases
దంతక్షయానికి కారణాలనేకం

అనేక రకాల పరిస్థితులు దంతక్షయానికి కార ణమవుతున్నాయి. ఉదరకోశంలో అనేక ఆమ్లాలు ఉత్పత్తి అయి, నోటిలోకి వస్తాయి. దీనిని గ్యాస్ట్రోఎనోఫాజియల్‌ అంటారు. నోటినుండి కడుపులోకి వెళ్లేమార్గంలో పుండు పడటంతో బాధపడేవారు, అధికంగా మద్యం సేవించేవారు ఎక్కువగా వాంతి చేసుకుంటూ ఉంటారు. దీని వలన కూడా ఆమ్ల ప్రభావం దంతాలపై పడి అవి దెబ్బ తింటాయి. దంతాలలో డెంటిన్‌ అనేది సున్నితమైన భాగం. ఇది బైటపడినప్పుడు లేదా క్షయానికి గురైనప్పుడు దంతాలలో రంధ్రాలు పడటం జరుగుతుంది. అంతే కాకుండా, డెంటిన్‌ సున్నితంగా ఉండటం వలనవేడి, చల్లని, తీపి పదార్థాలు తిన్నా, తాగినా బాధ కలుగుతుంది. నిమ్మ,నారింజ మొదలైనసిట్రిక్‌ ఆమ్లం కలిగిన ఫలాలు, ఫల రసాలు దంతాలకు హాని కలిగిస్తాయి. ఆమ్లస్వభావం కలిగిన ఆహార పదార్థాలు కూడా దంతాలకు కొద్దిగా హాని కలిగిస్తాయి. సోడా గ్యాస్‌ కలిగిన ద్రవాలు, కూల్‌ డ్రింక్స్‌ పళ్లకు హాని చేస్తాయి. ఆమ్ల స్వభావం కలిగిన ఆహార పదార్థాలు భోజన సమయంలో ఒకసారి తీసుకోవచ్చు. అయితే ఇటువంటి పదార్థాలు తిన్న, లేదా తాగిన ఒక గంట వ్యవధిలో బ్రష్‌ చేసుకుంటే దంతక్షయం తగ్గుతుంది.

ఆమ్లపూరితమైన ఆహార పదార్థాలు తిన్నా, తాగినా పంటిపై ప్రభావం ఉండి పళ్లు గార పట్టడం జరుగుతుంది. ఇది దంత క్షయానికి, పంటి మీద పింగాణి పొర పాడవటానికి కారణ మవుతుంది. చక్కెర లేదా చూయింగ్‌ గమ్స్‌ను 20 నిముషాలపాటు నమలడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. చూయింగ్‌ గమ్స్‌ నములుతున్న ప్పుడు లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ఆమ్ల ప్రభావంతగ్గి పంటి పింగాణి పొర ఖనిజ లవణాలను కాపాడుకుని దంత క్షయం రాకుండా నివారిస్తుంది. చాలా సంద ర్భాలలో స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ ఆమ్లత్వాన్ని కలిగి దంత క్షయానికి కారణమవుతాయి.