దండుపాళ్యం-2 రెగ్యులర్‌ షూటింగ్‌

SRINIVAS RAJU
వెంకట్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్‌ నిర్మించిన దండుపాళ్య కన్నడలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీగా 25 కోట్లు కలెక్ట్‌ చేసిన సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో దండుపాళ్యం పేరుతో విడుదలై 10 కోట్లు కలెక్ట్‌ చేసి శతదినోత్సవం జరుపుకుంది. ఇప్పుడు నిర్మాత వెంకట్‌ దండుపాళ్యం టీమ్‌తోనే ఆ చిత్రానికి సీక్వెల్‌గా దండుపాళ్యం-2ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబం ధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది. ఈ సందర్భ ంగా నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ తెలుగు, కన్నడ భాషల్లో దండుపాళ్యం చిత్రం ఎంతటి ఘన విజయాన్నిఅందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మా బేనర్‌లో దండుపాళ్యం టీమ్‌తోనే ఆ చిత్రానికి సీక్వెల్‌గా దండుపాళ్యం 2ని నిర్మిస్తున్నాం. రెగ్యులర్‌గా వచ్చే సినిమాలకు డిఫరెంట్‌గా ఉంటూ రియలిస్టిక్‌గా వుండే సినిమా ఇది. మా దండుపాళ్యం చిత్రానికి ఘన విజ యాన్ని అందించిన ప్రేక్షకులు దండుపాళ్యం 2ని కూడా సూపర్‌ హిట్‌ చేస్తారన్న నమ్మకం నాకు ఉందన్నారు.