థ్రిల్లర్‌ నేపథ్యంలో 16 ఎవ్రీ డీటెయిల్‌ కౌంట్స్‌!

16f
16 ఎవ్రీ డీటెయిల్‌ కౌంట్స్‌

థ్రిల్లర్‌ నేపథ్యంలో.. 16 ఎవ్రీ డీటెయిల్‌ కౌంట్స్‌!

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ సంస్థ నుంచి వరుసగా క్రేజీ సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే తమిళ బ్లాక్‌బస్టర్‌ ధురువంగల్‌ పదినారు (డి-16) తెలుగులో 16 ఎవ్రీ డీటెయిల్‌ కౌంట్స్‌ పేరుతో రిలీజ్‌ చేయనున్నారు. రెహ్మాన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహించారు. మార్చి తొలివారంలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ.. తమిళంలో ఇటీవల రిలీజై ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్నచిత్రాన్ని తెలుగులో అనువదించాం. డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మార్చి తొలివారంలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. హాలీవుడ్‌ స్థాయిలో ఉత్కంఠభరితంగా తెరకెక్కిన థ్రిల్లర్‌కి తమిళనాట విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అక్కడ ఇప్పటికీ చక్కని వసూళ్లతో దూసుకెళుతోంది. వాస్తవానికి ఈ సినిమాని టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, హీరోలు నేరుగా తెలుగులో రీమేక్‌ చేసే ఉద్ధేశంతో భారీ మొత్తాల్ని వెచ్చించి చేజిక్కించుకోవాలనుకున్నా.. పోటీపడి మరీ చేజిక్కించుకున్నాం. అందుకు తగ్గట్టే తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిది అన్నారు.