‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ వీడియో రిలీజ్

హీరో కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్

YouTube video

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ”కిన్నెరసాని”. ‘రమణ తేజ్ దర్శకత్వంలో సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ మరియు శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వైవిధ్యమైన టైటిల్ పోస్టర్ తో సినిమాపై ఆసక్తిని కలిగించిన చిత్ర యూనిట్. తాజాగా ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ ని రిలీజ్ చేశారు. నేడు హీరో కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం విడుదల చేసిన ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ ఆకట్టుకునేలా ఉంది.