థియేటర్లు తగలబెడితే మీరే నష్టపోతారు!

Raja singh
Raja singh

హైదరాబాద్‌: ఈనెల 25న విడుదలవుతోన్న పద్మావత్‌ సినిమాపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. పద్మావతి పేరును పద్మావత్‌గా మార్చేసి..అసలు ఈ సినిమా వల్ల ఎటువంటి సమస్య ఉండదని..కొంతమంది కావాలనే వివాదాన్ని రేపుతున్నారని ఆ సినిమా బృందం న్యాయస్థానానికి తప్పుడు పత్రాలు ఇచ్చిందని రాజాసింగ్‌ ఆరోపించారు. ఇటువంటి సినిమాలు తీసేవారికి సరైన సమాధానం ఇవ్వాలంటే మనం ఈ సినిమాను చూడొడ్దని వారు నష్టపోతే మరోసారి చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయబోరని ఆయన పేర్కొన్నారు. థియేటర్లు తగులబెడితే మీరే నష్టపోతారని..తాము ఇప్పటికే పలువురికి చెప్పామని రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు.