థాయిలాండ్‌కు చేరిన కరోనా..వ్యక్తి గుర్తింపు

Coronavirus
Coronavirus

థాయిలాండ్‌: ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో ప్రమాదఘంటికలు మోగిస్తోంది. అయితే ఈ కరోనా వైరస్‌ థాయిలాండ్‌లో ప్రవేశించింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తిని థాయిలాండ్‌ వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై ఆ దేశ వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తిని గుర్తించినట్టు తెలిపారు. అతడిని టాక్సీ డ్రైవర్‌గా గుర్తించామన్నారు. చైనాకు చెందిన టూరిస్టులను తన టాక్సీలో తిప్పినట్టు డ్రైవర్‌ చెప్పారని వివరించారు. కరోనా సోకిన వ్యక్తికి వైద్య సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/