త‌లనీలాల ద్వారా టీటీడీకి రూ.7.15 కోట్ల ఆదాయం!

ttd
ttd

తిరుమల: శ్రీవారికి భక్తులు మొక్కుగా సమర్పించే తలనీలాలను టీటీడీ ఈ-వేలం వేసింది. ఈ వేలం ద్వారా రూ.7.15కోట్ల ఆదాయం లభించింది. భక్తుల నుంచి సేకరించిన 9,900 కిలోల తలనీలాలను టీటీడీ విక్రయించింది. త‌ల‌నీలాల‌ను టీటీడీ నెలకోసారి వేలం నిర్వహిస్తుంటుంది. వివిధ రకాల తలనీలాలను విభజించి పారదర్శకంగా ఆన్‌లైన్‌ విధానం ద్వారా విక్రయిస్తుండటంతో స్వామివారికి భారీగా ఆదాయం ల‌భిస్తుంది.