త‌మ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం చంద్రబాబే

darmana
darmana

అమ‌రావ‌తిః తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడానికి ముఖ్య‌మంత్రి చంద్రబాబే కారణమని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని విమర్శించారు. స్పీకర్ కోడెల కూడా చంద్రబాబు డైరెక్షన్ లోనే నడుస్తున్నారని… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇప్పటికైనా సస్పెండ్ చేయాలని… అదే జరిగితే, తమ సభ్యులు అసెంబ్లీకి వస్తారని చెప్పారు. అత్యంత రహస్యంగా చంద్రబాబు 2వేల జీవోలను విడుదల చేశారని ఆరోపించారు. ప్రజల సొత్తును చంద్రబాబు ఆయన తాబేదార్లకు కట్టబెడుతున్నారని… పాదయాత్ర ద్వారా ఈ దోపిడీని ప్రజలకు జగన్ వివరిస్తున్నారని ద‌ర్మాన తెలిపారు.