త‌న 3జీ నెట్‌వ‌ర్క్‌ను మూసివేయ‌నున్న ఎయిర్‌టెల్‌?

airtel
airtel

ఢిల్లీః ప్ర‌ముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు నాలుగేళ్లలో తన 3జీ నెట్‌వర్క్‌ను మూసివేయాలని నిర్ణయించింది. డేటా సామర్థ్యాన్ని మరింత పెంచేలా 4జీ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం తనకున్న 3జీ స్పెక్ట్రమ్ (2100 మెగాహెర్ట్జ్)ను 4జీ సేవల కోసం వినియోగించుకోనుంద‌ని ఆ సంస్థ సీనియ‌ర్ అధికారి తెలిపారు.