త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్న ట్రంప్‌

TRUMP
TRUMP

అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలోకి వస్తున్న కుటుంబాలను అరెస్టు చేసి తల్లిదండ్రులను, పిల్లలను వేరుచేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో అధ్యక్షుడు ట్రంప్‌ తన నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. అక్రమ వలసదారుల కుటుంబాలను విడదీసి తల్లిదండ్రులను, పిల్లలను వేరుచేయకుండా అధికారిక ఉత్తర్వులను జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఇకపై కుటుంబాలను కలిపే ఉంచుతామని చెప్పారు. గత రెండు నెలల కాలంలో అక్రమంగా సరిహద్దులు దాటివచ్చిన కుటుంబాలకు చెందిన 2,500 మంది పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి విడదీసి శిబిరాలకు తరలించారు. ఆ శిబిరాలలో పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం హృదయవిదారకంగా ఏడుస్తున్న దృశ్యాలను మీడియా ప్రసారం చేసింది. దీంతో ట్రంప్‌ వలస విధానాలను రాజకీయ నాయకులు సహా ఐక్యరాజ్యసమితి అధికారులు, హక్కుల కార్యకర్తలు, కార్పొరేట్‌ సంస్థల అధిపతులు కూడా ట్రంప్‌ విధానాన్ని తప్పుపట్టారు.