త‌డ‌బాటుకు గురైన ఫెదరర్‌

FEDERER, NISHIKORI
లండన్‌: వందవ టైటిల్‌పై కన్నేసిన ఫెదరర్‌కు జపాన్‌ ప్లేయర్‌ నిషికోరి నుంచి షాక్‌ తగిలింది. ఏటిపి ఫైనల్స్‌లో ఫెడెక్స్‌ తొలి మ్యాచ్‌లోనే అందరినీ నిరాశ పరిచాడు. 7-6, 6-3 స్కోరుతో వరుస సెట్లలో ఓటమి పాలైనాడు. ఈ మ్యాచ్‌లో ఓడిన ఫెదరర్‌కు సెమీస్‌ వెళ్లే అర్హత సాధించే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. గతంలో ఆరు సార్లు ఈ టోర్నీని గెలిచిన ఫెదరర్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరిగే మ్యాచ్‌లో అతను సరైన పెర్ఫార్మెన్స్‌ చేయలేకపోయారు.