తజకిస్తాన్‌లో స్వల్ప భూకంపం
Earthquake
ముర్గహబ్: గత రాత్రి తజకిస్తాన్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైనట్లు యునైటెడ్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) తెలిపింది. ముర్గహబ్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో 91 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని చెప్పింది. అయితే ఈ భూప్రకంపనలకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని స్పష్టం చేసింది. తజకిస్తాన్‌లో భూప్రకంపనలు సంభవించడంతో.. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా భూమి కంపించింది. భారత్‌లో ఢిల్లీ, ఎన్సీఆర్, పంజాబ్, జమ్మూకశ్మీర్లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భారత్‌లో భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు ఎన్సీఎస్ అధికారులు తెలిపారు.