త్వ‌ర‌లో మెట్రో మ‌లి ద‌శ ప్రారంభం:కెటిఆర్‌

TS MINISTER KTR
K T R

హైద‌రాబాద్ఃఅతి త్వరలో మెట్రో రెండో దశ ప్రారంభం కానున్నట్టు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కాగా, శుక్ర‌వారం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. పాతబస్తీలో కూడా మెట్రో నడిపే రోజులు వస్తాయన్నారు. గల్లీలో బీజేపీ లీడర్లు కేసీఆర్‌ను ఎలా విమర్శించాలా.. అని తిరుగుతుంటారని, ఢిల్లీలోనేమో నరేంద్రమోడీ కేసీఆర్‌ గొప్పగా పని చేస్తారని పొగుడుతుంటారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటాయని వార్తలొస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు.