త్వ‌ర‌లో ప‌ర‌కాల‌కు తాగునీటి జ‌లాలు

Kadiyam Srihari
Kadiyam Srihari

వ‌రంగ‌ల్ః మార్చి 15వ తేదీ నాటికి పరకాలకు శుద్ధిచేసిన తాగునీటి జలాలను అందజేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర్ల‌ మండలం సింగరాజుపల్లిలో మిషన్ భగీరథ ఫిల్డర్ బెడ్ సంపులను మంత్రి నేడు పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ దయాకర్ పాల్గొన్నారు.
వరంగల్ రూరల్ జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్‌గా నియమితులైన బొల్లె బుచ్చన్న డిప్యూటీ సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి తన నియామకం పట్ల హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.