త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు సమీక్ష
నిర్వహించారు. కొత్తగూడెంలో జరిగిన ఈ భేటీకి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
ప్రాజెక్ట్‌కు త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసి పంప్‌హౌజ్‌ల నిర్మాణాలు చేపట్టి పూర్తిచేయాలని ఆదేశించారు. సీతారామ
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌బాద్ జిల్లాలో సుమారు 9.36లక్షల ఎకరాలకు
సాగునీరు అందనుందని చెప్పారు.