త్వరలో సైనా, కశ్యప్‌ల ప్రేమవివాహం

SAINA, KASHYAP
SAINA, KASHYAP

హైదరాబాద్‌: భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు త్వరలో ఒక ఇంటి వారు కాబోతున్నారు. మహిళా షట్లర్‌ సైనా నెహ్వాల్‌, మెన్స్‌ స్టార్‌ ప్టేయర్‌ పారుపల్లి కశ్యప్‌ త్వరలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఇరు కుటుంబాల వారు అంగీకరించడంతో డిసెంబరు 16న‌ హైదరాబాద్‌ వేదికగా వివాహం జరగవచ్చని సన్నిహిత వర్గాల సమాచారం. పెళ్లికి దగ్గరి బంధువులను, స్నేహితుల మధ్యలో జరపాలని, రిసెప్షన్‌కు మాత్రం అన్ని రంగాల ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. వీరి ప్రేమ పదేళ్ల నుంచి కొనసాగుతుంది.