త్వరలో బీఎస్సెన్నెల్‌ 4జీ సేవలు

BSNL11
BSNL

బీఎస్సెన్నెల్‌ వినియోగదారులకు శుభవార్త. వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్‌ అనుపమ్‌ శ్రీవాత్సవ తెలిపారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో 4జీ సేవలు ప్రారంభించిన బీఎస్సెన్నెల్‌ వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా 21 ప్రాంతాలలో 4జీ సేవలను అందించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వినియోగదారులు తమ 2జీ,3జీ సిమ్‌ కార్డులను రూ.20 నామ మాత్రపు చార్జీతో 4జీ సిమ్‌గా ఆప్‌గ్రేడ్‌ చేసుకోవలపి ఉంటుంది.