త్వరలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇళ్లు: టి.హరీశ్‌రావు

Harishrao
Harishrao

హైదరాబాద్‌: రాష్ట్ర నీటిపారుదల శాక మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్‌ అసోషియేషన్‌ (టిపీజేఏ) ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫి పోటిల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులు భద్రంగా ఉండాలని సిఎం చాలాసార్లు చెబుతూంటారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.100కోట్టతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాలకు సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉందని మంత్రి అన్నారు. కోర్టుకేసుతో సంబంధంలేకుండా రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. దీనిపై సిఎంతో తాను ప్రత్యేకంగా మాటాడతానన్నారు. త్వరలో ఈ పని పూర్తయ్యేలా చూస్తానని మంత్రి హామి ఇచ్చారు.