త్వరలో చమురు ధరలు తగ్గవచ్చు: మంత్రి ధర్మేంద్ర

Dharmendra Pradhan
Dharmendra Pradhan

అహ్మదాబాద్‌: గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ పెరుగుతున్న దరల నుంచి
వినియోగదారులకు కొంత ఉపశమనం కలగనుంది. పెట్రో, డీజిల్‌ ధరలు తగ్గుతాయని కేంద్ర చమురు శాఖ సహాయ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. యూఎన్‌లోహరికేన్‌ తుపాన్‌ ప్రభావంతో ఇటీవల పెరిగిన ఇందన ధరలు, అంతర్జాతీయ మార్కెట్‌
ప్రకారం ఇక్కడ కూడా అందుబాటులోకి రానున్నాయని ధర్మేంద్ర తెలిపారు. ఇప్పటికే గత మూడు రోజుల నుంచి ఇంధన ధరలు
తగ్గాయన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు తగ్గించే అవకాశముందా అని మీడియా అడిగిన ప్రశ్నకు మీకు మంచి రహదారులు
వద్దా..? సురక్షిత తాగునీరు అవసరం లేదా? మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.
దేశ సంక్షేమం, అభివృద్ధి కోసం వచ్చే పన్నుల ద్వారా నిధులు చాలా కీలకమైనవని, అవసరమైనప్పుడు ధరల పెరుగుదల తప్పదని
ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పకనే చెప్పారు.