త్వరలో అందుబాటులో అంతర్జాల సేవలు

K T R
K T R

హైదరాబాద్‌: నగరాల్లో ప్రతి ఇంటికి అంతర్జాల సేవలు అందుబాటులోకి రానున్నాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌
స్పష్టం చేశారు. మిషన్‌ భగీరథ పైప్‌లైన్లతో పాటు ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుళ్లు వేస్తామని తెలిపారు. ఇంటింటికి ఇంటర్నేట్‌
సేవల ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని చెప్పారు. నిర్ణీత సమయంలో మిషన్‌ భగీరథ పూర్తి
అవుతుందున్నారు. అర్బన్‌ మిషన్‌ భగీరథతో పాటు టీ ఫైబర్‌ ప్రాజెక్టు సమన్వయానికి చర్యలు తీసుకుంటున్నామని
చెప్పారు. ఐటీ, మున్సిపల్‌ శాఖలతో సంయ్తు వర్కింగ్‌ గ్రూపు ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.