త్వరలోనే రానున్న మండే సూర్యుడు!

HANSIKA
HANSIKA

త్వరలోనే రానున్న మండే సూర్యుడు!

పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో హీరోగా నటించిన ఆర్య, సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల క్రేజీ కథానాయిక హన్సిక జంటగా తమిళంలో రూపొంది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ గ నిలిచిన మీగా మాన్‌ చిత్రాన్ని సర్వల ఎంటర్టైన్మెంట్స్‌ మరియు శ్రీ సూర్య సాకేత్‌ పిక్చర్స్‌ తెలుగు లో మండే సూర్యుడు పేరుతో విడుదల చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనిధి సమర్పణ లో బెల్లంకొండ వెంకటేశ్వర్లు,కొలన ఎల్లారెడ్డి,సర్వల గణేష్‌ యాదవ్‌ అనువదిస్తున్న ఈ సూపర్‌ హిట్‌ చిత్రానికి మగిళ్‌ తిరుమేని దర్శకత్వం వహించారు.డ్రగ్‌ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆర్య స్టైలిష్‌ అండర్‌ కవర్‌ ఆఫీసర్‌ గా అద్భుతమైన పాత్రలో నటించారని, గ్లామర్‌ తో పాటు అభినయానికి స్కోప్‌ వున్నా పాత్రలో హన్సిక ఒక వైవిధ్యమైన రోల్‌ ప్లే చేసారని నిర్మాతలు తెలిపారు. తమిళంలో అఖండ విజయాన్ని సాధించి,హీరో ఆర్య కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ హిట్‌ గా నిలిచిన ఈ సినిమాలో ఇండియన్‌ డ్రగ్‌ మాఫియా నెటవర్క్‌ ఎలా ఉంటుంది?వారి ప్లన్స్‌ ఎలా ఉంటాయి?అనే అంశాలను ఎంతో రీసెర్చ్‌ చేసి దర్శకుడు మగిళ్‌ తిరుమేని సిల్వర్‌ wస్కీన్‌ మీద అద్భుతంగా ఆవిష్కరించారని నిర్మాతలు తెలిపారు.హీరో ఆర్య 7 గురు విలన్ల మధ్య జరిగే ట్రాక్‌ సినిమాకి హైలైట్‌ అవుతుందని ,అతి త్వరలో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామని చెప్పారు