త్రిపుర సియంగా బిప్‌ల‌వ్ కుమార్‌దేవ్ ప్రమాణ స్వీకారం

TRIPURA CM OATH
TRIPURA CM OATH

అగ‌ర్త‌లాః త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. త్రిపుర ముఖ్యమంత్రిగా బిప్‌ల‌వ్‌కుమార్ దేవ్, డిప్యూటీ సీఎంగా జిష్ణు దేవ్ బర్మన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తథాగతరాయ్ బిప్ లవ్‌కుమార్‌దేవ్, జిష్ణు దేవ్ బర్మన్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతోపాటు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ ఎంపీ మురళి మనోహర్‌జోషి, త్రిపుర మాజీ సీఎం మానిక్ సర్కార్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తదితరులు పాల్గొన్నారు. త్రిపురలో బీజేపీ-ఐపీటీఎఫ్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.