త్యాగానికి వైరాగ్యమే సాధనం

         త్యాగానికి వైరాగ్యమే సాధనం

lord krishna
lord krishna

ముముక్షువ్ఞలకు వారి యోగ్యతకు దగినట్లుగా భగవంతుని పరోక్ష జ్ఞానం కలుగుటకు ప్రధాన సాధనం భక్తియేయని భాగవతమే సాక్షీభూతంగా నిలిచింది.భాగవతంలో విదురుని పాత్ర త్యాగానికి ప్రతీక. విదురుడు కృష్ణభక్తుడు. వాసుదేవ నామాన్ని నిరంతరం స్మరించి, జపించి తరించినవాడు. కురువంశంలో జనించి సోద రుడైన ధృతరాష్ట్రునకు నీతిబోధగావిస్తూ, ధర్మమార్గాన్ని ప్రవచిస్తూ సన్మార్గం, సత్య సంధతల విశిష్టతను పలురకాలుగా తెలిపినాడు.

సకల సంపదలతో తులతూగే అర్హత లున్ననూ, అన్నిటినీ తూలనాడి షడ్గుణైశ్వర్య పరిపూర్ణుడైన కృష్ణపరమాత్మను నమ్మి కొలిచి దైవానుగ్రహపాత్రుడైనాడు. తనను విపరీతంగా నిందించి తూలనాడిన రారాజు దుర్యోధనుని పలుకులకు వ్యధ నొందిననూ వాసుదేవ్ఞని స్మరణలో వాటిని పరిగణనలోనికి తీసికొనలేదు భక్తుడైన విదురుడు. దాసీపుత్రుడని నిందించినా చిరునవ్ఞ్వతో స్వీకరించాడు. ఐశ్వర్యంలో ఓలలాడవలసిన వాడైననూ విదురుడు కృష్ణపక్షం వహించాడు.

దోష స్వరూపుల పలుకులను పెడచెవిన బెట్టినాడు. అన్నిటినీ త్యజించి ధృతరాష్ట్రుడు వారించినా వినక తీర్థయాత్రలకు పయనమైనాడు. తనకు వాసుదేవ్ఞని కృపచాల న్నాడు. ఎవరి దయాదాక్షిణ్యాలతో తనకు పనిలేదన్నాడు. అమంగళకరమైన వానిని వదలినాడు. అన్నిటినీ త్యజించినాడు. శ్లోII త్యజేదేకం కులస్యార్థే-గ్రామస్యార్థే కులం త్యజేత్‌ గ్రామం జనపదం స్యార్థే-ఆత్మార్ధం పృథివీం త్యజేత్‌II అని ధర్మశాస్త్రం. న్యాయం. విదురుడు సత్పురుషులు గోరదగిన శీలము గలవాడు.

త్యాగానికి ప్రతిరూపం. కురువైభవాన్ని, కురుసభను వదలి వచ్చునపుడు మాయయెంతటిదని మాయనే జరిగిన సన్నివేశమునకు హేతువ్ఞగా దలచినవాడై వెడలగొట్ట బడుటకు ముందు విదురుడు తానే వచ్చినాడు. అన్నిటినీ వదలు వేళ ధనుస్సును వాకిటనే బెట్టిపోయినాడు. కౌరవ్ఞలు ఎలాగైననూ మరణింతురు. ఇక ఈ ధనువ్ఞతో నాకేమి పనియని భవిష్యద్దర్శనము చేసినాడు. సర్వమునూ, సర్వులనూ త్యజించి తీర్థయాత్రకు పయనమైనాడు. ఏకాకిగా పయనమై హరికి సంతోషము కలిగించు వ్రతమునాచరిస్తూ, వల్కలాజినములు ధరించి యాత్మజనులచే గుర్తింపరానివాడై అవధూతగా మారినాడు.

సరస్వతీ దేవి తీరం చేరినాడు. విష్ణు సంబంధమైన క్షేత్రములను జూచినాడు. చక్రాంకితములైన మందిరములను గాంచి కృష్ణుని స్మరణలోనికి తెచ్చుకొనినాడు. నిజమైన భక్తుడు భగవంతునే తోడుగా ఎదలో నిలుపుకొనును. భగవంతునకు సంబంధించిన బంధువ్ఞలనే కలిసికొనుటకు ఉవ్విశ్లూరుచుండును. కృష్ణ ద్వేషులను గడ్డిపోచతో సమంగా భావించాడు. దోష స్వరూపులను వదలి, వారిచే తిరస్కరింపబడినపుడు ఆత్మపరిశీలనం చేసుకుని దైవాన్నే తనవానిగా చేసుకుని మసలే వానికి ఏ కష్టములు రావ్ఞ.

దరిజేరగా చేసుకుని మసలే వానికి ఏ కష్టములు రావ్ఞ. దరిజేరలేవని భావించిన విదురుడు ధనాదుల న్నిటిని వదలి వైరాగ్య భావనతో గృహము నుండి బయటకు వచ్చుట వాసుదేవ్ఞని లీలా విశేషంగా భావించినాడు. రాగభావన వదలి వైరాగ్యాన్నే పొందినాడు. త్యాగ బుద్ధితో మనసును వాసుదేవ ముఖంగా మళ్లించినాడు. తిరస్కారమును వాసుదేవ పురస్కారంగా భావించినాడు. కౌరవ్ఞలొనర్చిన పుణ్యముతోనే విదురుడు వారికి లభించినాడు.

ఈ విషయాన్ని రారాజు అయిన దుర్యోధనుడు గ్రహింపలేకపోయిన దాసీసుతునిగా నిందించినాడు విదురుని. పుణ్యమును సంపాదించు కోవాలనే కోరికతో సర్వమునూ త్యజించి వాసుదేవ స్మరణ తో త్యాగమునకు వైరాగ్యమే పరమమైన ప్రధమ సాధనం గా భావించిన పుణ్యాత్ముడు, మహాభక్తుడు విదురుడు. నీతిశాస్త్ర నిపుణుడు, ఆశయాచరణాత్మక శీలి, వినయశీలి, భక్తికి చిహ్నం.

శోచనీయమైన ధృతరాష్ట్రుని జీవన సామ్రాజ్యంలో ఇమడలేక శ్రీహరియనుగ్రహంతో సంతు ష్టుడై ధర్మపరుడై మహాత్యాగిగా వైరాగ్యపథంలో పయ నించి తన జన్మను వాసుదేవ భక్తిలోలయింప చేసుకొన్న ధన్యజీవి, త్యాగశీలి విదుర మహాశయుడు. భాగవతుడు. ”త్యాగే నేకైవ అమృత త్వమానసుః
– మూర్తి