తొలి 4మ్యాచుల్లోనే రికార్డు బద్దలు కొట్టిన ఇండియా

FANS1
FANS

తొలి 4మ్యాచుల్లోనే రికార్డు బద్దలు కొట్టిన ఇండియా

రష్యా వేదికగా 21వ ఫిఫా ప్రపంచకప్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సాకర్‌ అభిమానులు ఈ ప్రపంచకప్‌ను తెగ ఆస్వాదిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులతో రష్యాలోని స్టేడియాలన్నీ మారుమోగిపోతు న్నాయి. ఈ ప్రపంచ కప్‌ను ప్రత్యక్షంగా వీక్షించేం దుకుగాను సుమారు 10లక్షల మంది సాకర్‌ అభిమానులు రష్యాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక, అక్కడి దాకా వెళ్లి చూసే అవకాశం లేనివాళ్లు వివిధ మార్గాల్లో మ్యాచ్‌లు చూస్తూ ఆనందిస్తు న్నారు. గత ప్రపంచ కప్‌లతో పోలిస్తే ఈ ప్రపంచ కప్‌కు భారత దేశంలో కూడా భారీగా క్రేజ్‌ పెరిగింది.

టివి, ఆన్‌లైన్‌లో మ్యాచ్‌లు వీక్షించే అభిమానుల సంఖ్య భారత్‌లో గణనీ యంగా పెరిగినట్లు భారత బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) తన నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం భారత్‌లో కనీసం నిమిషానికి సుమా రు 4.7కోట్ల మంది ఈ ప్రపంచ కప్‌లోని మొదటి నాలుగు మ్యాచ్‌లను చూసినట్లు తెలిసింది. ఈ 4.7కోట్ల మందిలో టివిల ద్వారా వీక్షించిన అభిమానులు 4.1కోట్ల మంది కాగా, ఆన్‌లైన్‌లో 60లక్షల మంది వీక్షించడం విశేషం. భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, మహా రాష్ట్రలలో మాత్రమే ఈ వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పేర్కంది. ఇదిలా ఉంటే రష్యా, సౌదీ అరేబియా జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ను సుమారు 2కోట్ల (1.93కోట్ల) మంది చూసినట్లు తెలిసింది.

ఇందులో 45శాతం మది మహిళలే ఉండటం మరో విశేషం. ఈ ప్రపంచకప్‌ను యా వరేజిగా భారత్‌లోని సాకర్‌ అభిమానులు 39 నిమిషాల పాటు వీక్షించినట్లు పేర్కొంది. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటివరకు భారత్‌లో ఏ క్రీడను మహిళలు ఈ స్థాయిలో వీక్షించలేదని తెలుస్తోంది.రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా ప్రపంచకప్‌కు పెద్ద సంఖ్యలో భారత్‌ నుంచి వీక్షకులు ఉండటం గొప్ప విషయంగా చెబుతున్నా రు. ప్రస్తుతం ప్రపంచ కప్‌ గ్రూప్‌ స్టేజిలో ఉంది. ఇప్పటికే మొరాకో, ఈజిప్టు, ఆస్ట్రేలియా జట్లు గ్రూప్‌ స్టేజి నుంచి నిష్క్రమించాయి. ఈ ప్రపంచకప్‌ను భారత్‌లో సోనీ టెన్‌-2, టెన్‌-3, సోనీ ఈఎస్‌పిఎన్‌ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.
====