తొలి లోక్‌సభ సభ్యుడు కెఎస్‌ తిలక్‌ మృతి

K S Thilak
K S Thilak

విశాఖ: తొలి లోక్‌సభ సభ్యుడు కందాళ సుబ్రహ్మాణ్యం తిలక్‌(98) కన్నుమూశారు. 1952లో విజయనగరం నుంచి తిలక్‌ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో కందాళ సుబ్రహ్మాణ్యం తిలక్‌ పాల్గోన్నారు. తిలక్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తిలక్‌ భౌతికాన్ని ఆయన కుటుంబీకులు గాయత్రి వైద్యకళశాలకు దానం చేయనున్నారు.