‘తొలి ప్రేమ’ సక్సెస్‌ మీట్‌

toliprema
toliprema

బాపినీడు సమర్పణలో ఎస్‌విసిసి బ్యానర్‌పై మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘తొలిప్రేమ. వెంకీ అల్టూరి దర్శకత్వం వహించారు. బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈసినిమా థ్యాంక్స్‌ మీట్‌ ను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. చిత్ర నిర్మాత బివిఎస్‌ఎన్‌ప్రసాద్‌ మాట్లాడుతూ, ఈసినిమాను నమ్మి చేశానని, ఈచిత్రానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ బాగా సెట్‌ అయ్యారన్నారు. హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, ఈ కథను ప్రసాద్‌గారితో చేయటానికి సిద్ధమైనట్టు చెప్పారు .తానుసరేననుకున్నానని, ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెయిటింగ్‌లో ఉన్నపుడు పడే ఆవేదన నాకు తెలుసునని అన్నారు. ఎమోషన్స్‌, రిలేషన్స్‌ నాకూ ప్రసాద్‌ గారి కుటుంబానికి మధ్య బాగా ఉన్నాయన్నారు. ఫిదా తర్వాత వరుణ్‌తేజ్‌ మరలా ఈసినిమాలో బాగా చేశారన్నారు. మూడు పాత్రల్లో తనుచూపించిన వైవిధ్యం అందరినీ మెప్పించిందన్నారు.
చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ నా తొలి అంటెంప్ట్‌ను ఆదరించినందుకు ధన్యవాదాలు అన్నారు. హీరోయిన్‌ రాశిఖన్నామాట్లాడుతూ, ఈసినిమాకు వచ్చిన రివ్యూలన్నీ చదివానని, ట్విట్టర్‌లోనూ తనను వర్ష అని పిలుస్తున్నారని అన్నారు. ఈసినిమాలో ఆడవాళ్ల ఫ్యాన్స్‌ కూడ పెరిగారన్నారు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ, కథను అందరూ నమ్మి చేశారని, అందరికన్నా ముందు దిల్‌రాజుగారు నమ్మారన్నారు. అల్లూరి వెంకీకి రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో స్వప్న, తమన్‌, విద్యుల్లేఖా రామన్‌, బాపినీడు, తదితరులు మాట్లాడారు.