తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 303 ఆలౌట్
దక్షిణాఫ్రికా 137 4 (52 ఓవర్లు)
కాంప్టన్, టేలర్ హాఫ్ సెంచరీ
డర్బన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది.కాగా నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇంగ్లండ్ 4 వికెట్లకు 179 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండవ రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించి మరో 124 పరుగులు చేసి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో కాంప్టన్ 85 పరుగులు, జేమ్స్ టేలర్ 70 పరుగులతో ఆకట్టుకోగా ఆ తరువాత బెయిర్ స్టో 41 పరుగులు చేశాడు. కాగా 267 పరుగులకే తొమ్మిది వికెట్లను చేజార్చుకున్న తరుణంలో స్టువర్ట్ బ్రాడ్-ఫిన్ల జోడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లే యత్నం చేశారు. కాగా ఈ క్రమంలోనే బ్రాడ్ 32 పరుగులతో నాటౌట్‌గా నిలువగా పిన్ 12 పరుగులు చేసి సహకారం అందించడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరును చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్,మోర్నీ మార్కెల్లు ఒక్కొక్కరు నాలుగు వికెట్లు సాధించగా,అబాట్,పీడ్త్లకు చెరొ వికెట్ దక్కింది.ఆ తరువాత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో జిల్ జిరో పరుగులు,హషీమ్ ఆమ్లా 7 పరుగులతో నిరాశ పరిచారు.