తొలి టెస్టుకు అశ్విన్‌ దూరం?

Ravichandran Ashwin
Ravichandran Ashwin

లండన్‌: ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆడటంపై అనుమానాలు నెలకొ న్నాయి. ఇంగ్లాండ్‌ గడ్డపై ప్రస్తుతం ఎసెక్స్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యా చ్‌లో గాయపడిన అశ్విన్‌ కనీసం ఒక ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయలేక పోయాడు. అతని చేతికి తీవ్రమైన గాయం కావడంతో…మైదానం నుంచి పెవిలియన్‌కు వెళ్లిపోయిన అశ్విన్‌…మళ్లీ ఫీల్డింగ్‌కి రాలేదు. ఇప్పటికే గాయం కారణంగా…టెస్టు సిరీస్‌కి భువనేశ్వర్‌ దూరమవగా…జస్‌ప్రీత్‌ బుమ్రా ఆడటంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలో…సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ కూడా జట్టుకి దూరమైతే అది ఖచ్చితంగా భారత్‌కి గట్టి ఎదురుదెబ్బ. భారత వన్డే, టీ20 జట్టులో స్థానం దక్కకపోయినా…టెస్టులో మాత్రం అశ్విన్‌ గత ఏడాదికాలంగా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌తో పాటు గత నెలలో ఆప్గనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులోనూ ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఈ నేపథ్యంలో…ఇంగ్లాండ్‌ పిచ్‌లపై ఈ సీనియర్‌ స్పిన్నర్‌ భారత్‌కి ప్రధాన అస్త్రంగా మారతాడని ఇప్పటికే మాజీ క్రికెటయ్లి కితాబిచ్చారు. కానీ…తాజాగా గాయం భారత మేనేజ్‌మెంట్‌ని ఒత్తిడిలోకి నెట్టింది. ఒకవేళ అశ్విన్‌ ఆడలేకపోతే…అతని స్థానంలో యువ మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కి అవకాశం దక్కనుంది.