తొలివన్డేలో భారత్‌ అద్భుత విజయం

wins
India leads 1-0

తొలివన్డేలో భారత్‌ అద్భుత విజయం

పూణె: ఇంగ్లాండ్‌తో ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఘనంగా విజయం సాధించింది. 351 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది.. తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 350 పరుగులుచేసింది. భారత జట్టులో కోహ్లీ, కేదార్‌ జాదవ్‌లు సెంచరీలతో కదం తొక్కారు. దీంతో భారత్‌ గెలుపు సునాయశమైంది.. కాగా వీరిద్దరూ స్వల్ప తేడాతో ఔట్‌ కావటంతో చివరి దశలో ఉత్కంఠ నెలకొంది. పాండ్యా ధాటిగా ఆడటంతో భారత్‌ విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యతతో ఉంది.