‘తొలిప్రేమ ప్రీ రిలీజ్‌ వేడుక

toliprema
toliprema

‘తొలిప్రేమ ప్రీ రిలీజ్‌ వేడుక

మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా ప్రముఖ నిర్మాణంస్థ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై నిర్మించిన చిత్రం తొలిప్రేమ..రాశిఖన్నా హీరోయిన్‌గానటించింది.. యువ దర్శకుడు వెంకీఅట్లూరి దర్శకుడు. బివిఎస్‌ఎన్‌ప్రసాద్‌ నిర్మాత.ఈచిత్రాన్ని ఈనెల 10న విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా భీమవరంలోఎస్‌ఆర్‌కెర్‌ కళాశాలప్రాంగణంలోప్రీరిఈలజ్‌వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో దిల్‌రాజు,బివిఎస్‌ఎన్‌ప్రాసద, ఎమ్మెల్యే రాధాకృష్ణ, హీరో వరుణ్‌తేజ్‌,రాశీఖన్నా, దర్శకుడ వెంకీ అట్లూరి, హైపర్‌ ఆది, డిస్ట్రిబ్యూటర్‌ ఎల్‌విఆర్‌ , తణుకు డిఎస్పీ, ఎస్‌ఆర్‌కెఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పార్ధసారధితదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు వెంకీ మాట్లాడుతూ కథను, రాసింది , రిలీజ్‌ చేసేది దిల్‌రాజుగారైతే, సినిమానునిర్మింంచింది మాత్రం బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ అన్నారు. జీవితం ఓ సర్కిల్‌అని వినే ఉంటాం.. నా జీవితంలో అలాగే జరుగుతోందన్నారు.. తొలిప్రేమ సినిమాను చేసినపుడు, చూసినపుడు ప్రేక్షకులకుఓ ఫ్రెష్‌నెస్‌ ఎలా కల్గిందో అలాంటి ఫ్రెష్‌నెస్‌తోనే ఈసినిమానుచేశామన్నారు.. ఈసినిమా టైటిల్‌పెట్టినపుడు కాస్త భయపడ్డామని, వరుణ్‌ టైటిల్‌ అయితే పెడుతున్నాం.. ఫర్వాలేదు కదా అని అన్నాడని అన్నారు.. ఆసినిమాతో నేను పోలిక పెట్టను కానీ, గౌరవాన్నికాపాడతానని మాట ఇస్తున్నానని అన్నారు.. బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, 33 సంవత్సరాల క్రితం మెగాస్టార్‌తో సినిమా తీయాలని తణుకునుండి మద్రాసు వెళ్లానని, తర్వాత బన్నితోఆర్య2, మెగాసవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తోమగధీర, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌తో అత్తారింటికి దారేది సినిమా చేసే అవకాశందక్కిందన్నారు. ఇపుడుమా మెగాప్రిన్స్‌వరుణ్‌తేజ్‌తోతొలి ప్రేమ సినిమా చేశామన్నారు.. గ్యారెంటీగా సినిమా పెద్దహిట్‌ అవుతుందన్నారు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ మాసినిమాకు పనిచేసినదర్శకుడు వెంకీ తొలి చిత్రమే అయినా ఎంతో కన్విక్షన్‌తో చేశాడన్నారు.. తనుభవిష్యత్‌లో పెద్ద దర్శకుడవుతాడని అన్నారు.. ఇక ఈసినిమాకు అందరికంటే ఎక్కువగా నిర్మాత దిల్‌రాజుగానేఈసినిమాకు సపోర్ట్‌గా నిలిచారన్నారు.. తొలిప్రేమ అన్న టైటిల్‌తో20 ఏళ్ల తర్వాత నేను అదే టైటిల్‌తో చేస్తున్న సినిమా అని. దానికి రీమేకో,కాపీయో కాదని అన్నారు.కథకు తగ్గ టైటిల్‌ అన్పించేపెట్టామన్నారు.. బాబా§్‌ు టైటిల్‌ని పాడుచేస్తానని ఎవరూ అనుకోవద్దని అన్నారు..ఫిబ్రవరి 10న సినిమా విడుదల అవుతుందని, మా ఫ్యామిలీ నుంచితేజుసినిమా ఫిబ్రవరి 9న, నా సినిమా ఫిబ్రవరి 10న విడుదల అవుతుందన్నారు.. ఆ మధ్య కాంపిటీషన్‌ ఏదీ లేదని, ఇద్దరం చిన్నతనం నుంచి కలిసి పెరిగామన్నారు. నాసినిమా ఎంత పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నానో తేజు సినిమాకూడ అంతే సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.