‘తొలిప్రేమ’ టిజర్ డిసెంబర్ 20 న

Varun Tej
Varun Tej

వరుణ్ తేజ్ తాజాగా నటించిన సినిమా ‘తొలిప్రేమ’ వెంకి అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇటివలే లండన్ లో పూర్తి చేసుకుంది. రాశిఖాన్న హీరొయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టిజర్ డిసెంబర్ 20 న ఉదయం 10 గంటలకు విడుదల చెయ్యనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కు మరో హిట్ తెచ్చి పెడుతుందేమో చూడాలి. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.