తొలకరిలోగా రైతు అకౌంట్లలో డబ్బు

TS CM Kcr1

తొలకరిలోగా రైతు అకౌంట్లలో డబ్బు

వరంగల్‌:  తొలకరిలోపురైతులకు అకౌంట్లలోడబ్బులు పడేలా చేస్తామని సిఎం తెలిపారు.. వరంగల్‌ సభలో రైతుల నుద్దేశించి ఆయనమాట్లాడారు..అక్టోబర్‌ 15 లోగా మరోసారి రూ.4 వేలు జమచేస్తామన్నారు.. ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలుక సాయం అందిస్తామన్నారు.. పాలేరులో పదిన్నర నెలల్లో భక్తరామదాసు పూర్తయిందన్నారు.

మన పంటలకు మనే ధర నిర్ణయించుకోవాలి

తెలంగాణ రైతులను ధనికులను చేస్తామని సిఎం తెలిపారు.రూ.17వేల కోట్ల రైతుల ఉణాలు మాఫీ చేశామని ఆయన గుర్తుచేశారు.. మన కార్యక్రమానికి మనమే కాపలా ఉండాలని తెలిపారు.మనం పండించేపంటలకు మనమే ధర నిర్ణయించుకునే రోజు రావాలన్నారు..

కాళేశ్వరం,పాలమూరు పూర్తయతే తెలంగాణ సస్యశ్యామల

కాళేశ్వరం, పాలమూరు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని సిఎం తెలిపారు.. భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా 67 వేల ఎకరాలకు నీరిస్తున్నామన్నారు.. ప్రాజెక్టులు ప్తూయితే రాజకీయ భవిష్యత్‌ ఉండదని ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు.. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసులు వేస్తున్నాయన్నారు.

మత్స్యశాఖకు రూ.వెయ్యి కోట్లు

మత్య్స పరిశ్రమ అభివృద్ధికి కోసం రూ.వెయ్యికోట్లుకేటాయించిమని సిఎం కెసిఆర్‌ తెలిపారు. గురువారంరాత్రి ఇక్కడి బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తున్నారు.. 19వేల చెరువుల బాగు చేసుకున్నామన్నారు.. తెలంగాణలో ఏ కొరత లేకుండా చేస్తామన్నారు.. రైతులుసంఘాలుగా ఏర్పడాలన్నారు.