తొమ్మిది మంది కొత్తవారు కేబినెట్ లో

MODI CABINEt

MODI CABINET

తొమ్మిది మంది కొత్తవారు కేబినెట్ లో

ప్రధాని నరేంద్ర మోడీ మరి కొద్ద సేపటిలో తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు. ఈ సారి పునర్వ్యవస్థీకరణలో తొమ్మిది మంది కొత్తవారికి ఆయన కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. వీరిలో ఐదుగురు తొలి సారి లోక్ సభకు ఎన్నికైన వారు. అలాగే నలుగురు మంత్రులకు వారి పని తీరు ఆధారంగా ప్రమోషన్ ఇస్తున్నారు. ఈ సారి మంత్రివర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ అవకాశం దక్క లేదు. కొత్తగా కేబినెట్ లో చేరనున్న తొమ్మిది మందిలో నలుగురు బ్యూరోక్రాట్లు కావడం గమనార్హం. అలాగే ప్రమోషన్లు పొందుతున్న మంత్రులలో పియూష్ గోయోల్, ధర్మేంద్ర ప్రదాన్, నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నక్వి ఉన్నారు.