తేల్చుకుంటారా? తెంచుకుంటారా?

                   తేల్చుకుంటారా? తెంచుకుంటారా?

Amaravati
Amaravati

రైల్వేశాఖకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విశాఖజోన్‌ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతో ఇంతో పోలవరం విషయంలో కొంత మేరకు చేస్తున్నారని చెప్పొచ్చు.ఇక విశాఖజోన్‌ విషయంలో స్వరం మారిపోయింది. కానీ ఆ విషయం బయటకు చెప్పకుండా పొరుగురాష్ట్రాలతో సంప్రదిం పులు చేస్తున్నామని చెప్తున్నారు. ఎంతకాలం చర్చలు జరుపుతారు? ఇప్పటికీ నాలుగేళ్లు కావస్తున్నది. ఈ చివరి బడ్జెట్‌లో కూడా దాని ప్రస్తావనే లేకుండాపోయింది. దాదాపు నాలుగేళ్లుగా పొరుగు రాష్ట్రా లతో చర్చలు జరుపుతున్నామంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఎలా నమ్మిస్తారు? కొన్ని అవాస్తవాలు చెప్పినా అవి అతికేటట్టు ఉండాలి. గోడ కట్టినట్లు ఉండాలి. అంతేతప్ప తాత్కాలిక అవసరాల కోసం ఏదో దాటించే మాటలతో తడికల్లినట్టు అబద్దాలు చెప్పితే డొల్లతనం బయటపడుతుంది.
కుమారుని గుణం పెళ్లి తర్వాత, కుమార్తె గుణం వయసులో, భర్త గుణం భార్య అనారోగ్యంలో, భార్యగుణం భర్త పేదరికంలో, స్నేహితుని గుణం కష్టాల్లో, పిల్లల గుణం వృద్ధాప్యంలో, అలాగే రాజకీయ నాయకుల గుణం అధికారపీఠం అధిష్టించినప్పుడు తెలుస్తుందంటారు పెద్దలు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాటలు అధికారంలోకి వచ్చేసరికి మారి పోతుంటాయి.ఏ సమస్యలకోసమైతే రోడ్లమీదకు వచ్చి పోర డుతా రో అధికారంలోకి రాగానే స్వరం మార్చి ఆ సమస్యలను మరిచిపో యినట్లే నటిస్తుంటారు. ఇదేదో ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు కీలక పీఠాలను అధి ష్టించినా దాదాపు ఇదేపరిస్థితి. వ్యక్తులకంటే ఆ అధికారపు కుర్చీల్లో ఏమైనా ప్రభావం ఉందేమోననిపిస్తున్నది. పూర్వకాలంలో భోజరాజు పరి పాలనలో ఒక మంచెపై ఎక్కి తన తోటను కాపాడుకుం టున్న ఒక రైతు ఆ దారిన వెళ్లే బాటసారులను పిలిచి పండ్లు తినండి, బావివద్ద చల్లటి మంచినీరుతో దాహం తీర్చుకొని విశ్రమించండి అంటూ పదేపదే అభ్యర్థించేవారట.

ఆయన కోరిక మేరకే కొందరు బాట సారులు తోటలోకి వచ్చి పండ్లు కోసుకొని, చెట్టుకింద కూర్చొని తింటుంటే మంచె దిగి వచ్చిన రైతు తన తోటలోకి ఎందుకు వచ్చా రు? ఎందుకు పండ్లు కోసుకున్నారు? అంటూ రకరకాలుగా దుర్భాషలాడేవారట. మంచెమీద కూర్చున్నప్పుడు ఒకమాట దిగి వచ్చిన తర్వా త అందు కు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడటం ఆ రైతుకు నిత్యకృత్యమైపోయింది. ఈ విషయం ఆనోటా ఆనోటా పడి భోజరాజుకు తెలిసిందట. ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడోనని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారట. దీంతో ఆ మంచెకింద ఏదైనా మహిమ ఉండొచ్చునేమోనని త్రవ్వించారు. అక్కడ రత్నఖచితమైన సింహాసనం బయటకు వచ్చిందట. ఆ సింహాసనం ప్రభావంతో మంచెపై ఉన్నప్పుడు అలా మాట్లాడేవా డని, కిందికి దిగిరాగానే మామూలు మనిషి అయ్యేవాడని, అది విక్రమాదిత్య సింహాసనమని చెప్పుకునేవారు. అది నిజంగా జరిగిం దో లేదా కట్టుకథ కావచ్చో కానీ మారినపరిస్థితుల్లో మన నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రోడ్ల మీద ఉన్నప్పుడు ఒకమాట.

కుర్చీలో కూర్చున్నప్పుడు ఒకమాట సాధారణమైపో యింది.ఈ సోదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే ఆంధ్ర ప్రదేశ్‌ విభజన సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర పెద్దలు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? ఆనాడు తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఏమేమి వాగ్దా నాలు చేశారు? అందులో ఇప్పటికీ ఎన్ని నెరవేర్చారు? ఒక్కసారి పరిశీలిస్తే వాస్తవాలు ఏమిటో వారికి కూడా తెలియకపోదు. ఈ పార్టీ ఆ పార్టీ అనికాదు.ఎవరినో నిందించడం కోసమో, తప్పుపట్టడం కోసమో ఈ ప్రయత్నం చేయ డం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నవారిపై ఉంటుంది. అందుకే ముందుగా బిజెపి పార్టీని తీసు కుందాం. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరి గిందని ఆరాటపడింది. ఆవేదన చెందింది. అంతో ఇంతో గళం వి ప్పింది. ఆనాటి బిజెపినేత ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనా యుడు. ప్రత్యేక హోదా ఐదేళ్లు అంటే ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధిచెందాలంటే ఆసమయం సరిపోదని పదేళ్లు కావాలని పట్టు బట్టింది అయన్నే.ఏమైతేనేం చేసిన వాగ్దానాలు అన్నీ బిల్లు రూపం దాల్చే అవకాశం లేకపోవడంతో ఆనాటి ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంటు వేదిక నుంచి హామీ ఇచ్చారు. మొత్తం మీద విభ జన జరిగిపోయింది.

ఎపి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మా ణాలు, ఆర్థికలోటుతోపాటు ప్రత్యేకహోదా ఇచ్చి పరిశ్రమల అభి వృద్ధికి తోడ్పడతామని ప్రకటించారు. అలాగే రైల్వేశాఖకు సం బం ధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విశాఖజోన్‌ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతో ఇంతో పోలవరం విషయంలో కొంత మేరకు చేస్తున్నారని చెప్పొచ్చు.ఇక విశాఖజోన్‌ విషయంలో స్వరం మారిపోయింది. కానీ ఆ విషయం బయటకు చెప్పకుండా పొరుగురాష్ట్రాలతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్తున్నారు. ఎంత కాలం చర్చలు జరుపుతారు? ఇప్పటికీ నాలుగేళ్లు కావస్తున్నది. ఈ చివరి బడ్జెట్‌లో కూడా దాని ప్రస్తావనే లేకుండాపోయింది. దాదాపు నాలుగేళ్లుగా పొరుగు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామంటే ప్రజ లు ఎలా నమ్ముతారు? ఎలా నమ్మిస్తారు? కొన్ని అవాస్తవాలు చెప్పి నా అవి అతికేటట్టు ఉండాలి. గోడ కట్టినట్లు ఉండాలి. అంతే తప్ప తాత్కాలిక అవసరాల కోసం ఏదో దాటించే మాటలతో తడికల్లినట్టు అబద్ధాలు చెప్పితే డొల్లతనం బయటపడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆనాడు విభజన సమయంలో పార్ల మెంటు తలుపులు మూసేశారనే విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆనాటి సభలో నరేంద్రమోడీ లేకపోవచ్చు. కానీ బిజెపి పార్లమెంటు సభ్యు లందరూ ఉన్నారు.

వారు కూడా ఆమోద ముద్రవేశారు కదా? ప్రధా ని ఆ విషయం ఎందుకు ఇంతకాలం తర్వాత ప్రస్తావించారో అమా యకులకు సైతం అర్థమవ్ఞతుంది. రాజకీయ నాయకులు రాబోయే ఎన్నికలగూర్చి ఆలోచిస్తే రాజనీతిజ్ఞులు భావితరాల గురించి మదన పడతారంటారు.ప్రస్తుతం ప్రధానికి రాబోయే ఎన్నికలే కన్పిస్తున్నా యి.అందుకు కాంగ్రెస్‌ లక్ష్యంగా చేసుకొని ఆయన పార్లమెంటు వేదిక ద్వారా ప్రసంగించారు. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. పాత చరిత్ర అంతా ఏకరువ్ఞ పెట్టారు. రాజీవ్‌గాంధీ ఆనాటి సిఎం అంజ య్యను అవమానపరిచాడనే విషయం కూడా గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ను విమర్శించడానికి పార్లమెంటును వేదికగా చేసుకోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవడంలో కొంత సహేతుకత ఉంది.కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు ఆయనకు లేదని కాదు. కానీ అది రాజకీయ సభ కాదు కదా! అంతేకాదు సభలో లేనివారిని అందులో చనిపో యిన వారి గురించి దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటులో విమర్శనాస్త్రాలు గుప్పించడం ఎంతవరకు సమంజ సమో పెద్దలు విజ్ఞతతో ఆలోచించాలి. అలా ఎందుకు చేశారో? వారు వచ్చి సభలో వివరణ ఇవ్వలేరు కదా!సభలో లేని వారి గురించి ప్రస్తావించడం సమంజసం కాదని శాసనసభల్లో స్పీ కర్లు ఎన్నోసందర్భాల్లో రూలింగ్‌ఇచ్చిన సంఘటనలున్నాయి.

మోడీ ప్రసం గంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఆయన అయినా తమ గోడును అర్థం చేసుకొని కష్టాల నుం చి గట్టెక్కించేందుకు నాలుగు మాటలు అయినా చెప్తారని ఆశించా రు. కానీ నిరాశే మిగిలింది. గురువారం చేసిన రాష్ట్రబంద్‌ విజయ వంతం అయింది.ఇక తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడుకి మంచి వ్యూహకర్తగా పేరుంది. పరిపాలనాధక్షు డిగా గుర్తింపు ఉంది. అపార అనుభవం ఉంది. వ్యూహాత్మకంగా ఎన్నికల ముందే బిజెపితో జతకట్టారు. ఆనాడు మోడీ గాలి, పవన్‌ కళ్యాణ్‌తోపాటు అన్నిటికంటే ఎక్కువగా రాష్ట్రంలో నెలకొన్న అప్పటి క్లిష్టపరిస్థితుల్లో చంద్రబాబునాయుడయితేనే రాష్ట్రాన్ని కష్టాల నుంచి గట్టెక్కించగలడని నమ్మకం, విశ్వాసంతో అధికారం అప్పగించారు. కేంద్ర మంత్రివర్గంలో రెండు మంత్రిత్వాలు సంపాదించడంతోపా టు రాష్ట్రంలో తన మంత్రివర్గంలో బిజెపి పెద్దలకు స్థానం కల్పిం చారు. ఇద్దరు కలిసి కేంద్రం నుండి నిధులు తెచ్చి రాష్ట్రాన్ని పురోగా భివృద్ధివైపు పరుగులు పెట్టిస్తారని ఆయనను వ్యతిరేకించే వారు సైతం ఆశపడ్డారు. ఏ ఏడాది కాఏడాది ఎదురు చూడడంలోనే నాలు గేళ్ల కాలం పూర్తికావస్తుంది. ముఖ్యమంత్రి ఇప్పటికీ ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్లివచ్చారు. పోనుపోయారు రానువచ్చారన్నట్టే ఉంది.

సాధించింది ఏమీ లేదని తెలిసిపోయింది. ఇచ్చిన హామీల మేరకు సహాయసహకారాలు అందించడం లేదని హస్తిన పెద్దలు నిరాదరణ వైఖరి అవలంభిస్తున్నారనే వాస్తవాన్ని తెలు సుకోవడానికి నాలుగేళ్లు పట్టిందంటే అందులోనూ చంద్రబాబులాంటి మేధావికి ఇంతకాలం పట్టడం ఆలోచించదగ్గ విషయమే. ఇప్పటికీ ఇద్దరుమంత్రులు కేంద్రంలో కొనసాగుతున్నారు. క్యాబినెట్‌ నిర్ణయం లేకుండా నిధుల కేటాయింపులు, పథకాల మంజూరు అయ్యే అవశాలులేవ్ఞ. ఇంతకాలం ఈ మంత్రులు ఏమి చేస్తున్నట్టు? తమ చిన్నిపొట్టకు శ్రీ రామరక్షగా అన్నట్లుగా ఉన్నారా? కేంద్ర వైఖరిని ఎందుకు పసి గట్టలేకపోయారు? ఇప్పుడు కూడా క్యాబినెట్‌ నిర్ణయాల్లో వీరి భాగస్వామ్యం లేదా అక్కడ నోరు మెదపకుండా బయటకు వచ్చి నినా దాలు ప్లేకార్డులు చేస్తుంటే ఎలాంటి సంకేతాలు వెళ్తాయో మనసు పెట్టి ఆలోచించం డి. ‘నేను కొట్టనే కొడతాను, నువ్ఞ్వ ఏడ్చినట్లే ఏడువ్ఞ మనం కొట్లాడుకుంటున్నామని వచ్చిన చుట్టం వెళ్లిపోతారని వెనకటికి ఓ భర్త తన సతీమణికి సలహా ఇచ్చాడట.అలాఉంది ఈ వ్యవహారం.

మిత్రపక్షంగా ఉండి మంత్రివర్గంలో ఉండి ధైర్యంగా అధికారపక్షానికి ఎదురొడ్డి పోరా డుతున్నామ ని తెలుగుదేశం నేతలు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర విభ జన సమ యంలో అటు తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎంపిలు కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్‌ చెందిన కాంగ్రెస్‌ ఎంపిలు పెద్ద పోరాటమే చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌ అధిష్టానానికి వ్యతిరేకంగా పోరాటం చే యడం అంటే మామూలు విషయం కాదు. అయినా రెండు రాష్ట్రా ల్లో ప్రజలు వారిని విశ్వసించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొమ్ములు తిరిగిన నాయకులను కూడా డిపాజిట్లు దక్కకుండా చేసి ఇంట్లో మూలన కూర్చొబెట్టారు. ఈ విషయం టిడిపి పెద్దలు మరిచిపోకూడదు. ఇక వైస్సార్‌సిపి అధినేత జగన్‌ పాద యాత్రలో నిమగ్నమై అప్పుడప్పుడు ప్రత్యేకహోదా డిమాండ్‌ ను తెరపైకి తెస్తున్నారు. ఏపికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యంగా ప్రత్యేక హోదాకోసం కేంద్రంపై పోరాటానికి సిద్ధమేనని ప్రకటిస్తున్నారు.

కానీ బిజెపికి అవసరమైన ప్పుడు అడిగినా, అడగకపోయినా తమ షరతులు లేకుండా తన సహాయ సహకారాలు, మద్దతును అందిస్తూనే ఉన్నారు. ఆయన కున్న ఇబ్బందులు కారణాలు అయనకున్నాయి. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఒక విలక్షణమైన రాజకీయ వాది. ఇప్పటికీ అయోమ యధోరణిలో ఉన్నారు. మేధోపరమైన అయోమయం పవన్‌ను వేధిస్తున్నదేమోననిపిస్తున్నది. అందుకే తన పంథా ఏమిటో స్పష్టంగా ప్రకటించలేకపోతున్నారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కావలసింది తమకు న్యాయం కోసం పోరాడే నాయకుడు కావాలి. అందుకోసం అన్ని దిక్కులు చూస్తున్నారు. తెలంగాణకు కెసిఆర్‌ ఎలా ఉన్నారో అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్‌ పురోగాభివృద్ధే ఏకైకలక్ష్యంగా, ధ్యేయంగా త్రికరణశుద్ధిగా రాష్ట్రాన్ని విజయవం తంగా నడిపించే నాయకత్వం కోసం చూస్తున్నారు. ఏదిఏమైనా ఒక్కటి మాత్రం నిజం. కొందరిని కొంత కాలం మోసం చేయవచ్చు. మరికొందరిని ఎల్లకాలం మోసం చేయవచ్చు. అందరిని ఎల్లకాలం మోసం చేయాలనుకుంటే అదే భ్రమే.
–  దామెర్ల సాయిబాబ