తేజ హీరోగా హరి దర్శకత్వంలో

NEW MOVIE
NEW MOVIE

తేజ హీరోగా హరి దర్శకత్వంలో 

చూడాలని ఉంది. ఇంద్ర, యువరాజుతోపాటు దాదాపు 50 సినిమాల్లో బాలనటుడిగా తెరపై కనువిందు చేసిన మాస్టర్‌ తేజ.. ఇపుడు తేజగా మారి హీరోగా పరిచయం అవుతున్నాడు.. ఈ లాంచింగ్‌ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్‌ (గోపి) నిర్మిస్తున్నారు.. ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సంస్థలో దర్శకత్వ విభాగంలో దాదాపు 8 ఏళ్లు పనిచేసిన హరి ఈసినిమాకు దర్శకత్వంలో వహిస్తున్నారు.. నిర్మాత గోపి మాట్లాడుతూ, కథ అద్భుతంగా కుదిరిందన్నారు.. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే యూత్‌ఫుల లవ్‌స్టోరీ అన్నారు.. కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుందన్నారు.. సెప్టెంబర్‌ 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుందన్నారు.. ఉయ్యాల జంపాల, స్వామిరారా, చిత్రాలకు స్వరాలను సమకూర్చిన సంగీత దర్శకుడు సన్నీ ఎంఆర్‌ మా సినిమాకు బాణీలిస్తున్నారు.. ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.