తేజ్‌ప్రతాప్‌ విడాకులకేసు జనవరి 8కి వాయిదా

tej pratap yadav
tej pratap yadav

పాట్నా: ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ పెద్దకుమారుడు తేజ్‌ప్రసాద్‌యాదవ్‌ తన భార్యనుంచి విడాకులుకోరుతూ దాఖలైన పిటిషన్‌ విచారణకు తేజ్‌ప్రసాద్‌ పాట్నాకోర్టుకు హాజరయ్యారు. ఆన్‌కెమేరా విధానంలో విచారణ నిర్వహించారు. జడ్జి ఉమాశంకర్‌ ద్వివేది ఈకేసును తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ న్యాయవాదుల బృందం విజ్ఞప్తిమేరకు ఆన్‌కెమేరా విచారణనిర్వహించారు. ఢిల్లీకి చెందిన న్యాయవాది అమిత్‌ ఖెంకా తేజ్‌ప్రతాప్‌ తరపున వాదించారు. కోర్టు విచారణకు హాజరై తిరిగి వెళుతూ తేజ్‌ప్రతాప్‌ మీడియాతోమాట్లాడుతూ నాపోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. జనవరి ఎనిమిదవ తేదీకి ఈ కేసును వాయిదావేసారు. విడాకులకు కోర్టులో దాఖలుచేసినప్పటినుంచి తేజ్‌ప్రతాప్‌ గతనవంబరు 3నుంచి ఇప్పటివరకూ ఆచూకీ తెలియకుండానే తప్పించుకుని తిరుగుతున్నారు. పాట్నాకు బుధవారమే వచ్చినా తనకుటుంబసభ్యులును ఎవ్వరినీ కలుసుకోలేదని, తన ఇంటికి సైతం వెళ్లలేదని అన్నారు. అంతకుముందు న్యాయవాది ఖెంకా మాట్లాడుతూ నేను ఎలాంటి వివరాలు ఇవ్వలేదనని, ఇదేమీ రాజకీయ కేసు కాదని,ఇద్దరు యుక్తవయసు దంపతులకు సంబంధించినది అయినందున వివరాలు అడగవద్దని కోరారు. ఐశ్వర్యరా§్‌ుతో వివాహంజరిగిన ఆరునెలలకే తేజ్‌ప్రతాప్‌ పాట్నాకోర్టులో విడాకులకు దరఖాస్తుచేసుకున్నారు. హిందూ వివాహచట్టంప్రకారమే కేసు దాఖలుచేసాడని, ఇందుకుగల కారణాలనుసైతం స్పష్టంచేసినట్లు న్యాయవాది చెప్పారు. తొలుత ఈ విచారణను 29వ తేదీ అంటే గురువారం విచారిస్తామని కోర్టు స్పష్టంచేయడంతో కోర్టుహాలు మొత్తంక్రిక్కిరిసిపోయింది. మాజీ మంత్రి చంద్రికారా§్‌ు, మాజీ ముఖ్యమమంత్రి దరోగా ప్రసాద్‌ మనమరాలు ఐశ్వర్యారా§్‌ు తేజ్ప్‌తాప్‌లకు ఈఏడాది మేనెల 12వ తేదీనే పాట్నాలో వివాహంజరిగింది. న్యాయవాదుల అంచనాలప్రకారం సాధారణకేసుల్లో విడాకుల పిటిషన్లను పెళ్లి జరిగిన తర్వాత ఏడాదివరకూ విడాకుల పిటిషన్లను అనుమతించరు. అయితే ఈకేసు ప్రత్యేకం కావడంతో నిర్ణయం తీసుకోవాలిస ఉందని అన్నారు. తేజ్‌ప్రతాప్‌ బుజ్జగింపుచర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో రెండుకుటుంబాల్లోను నిస్ప్రహ చోటుచేసుకుంది. లాలూప్రసాద్‌యాదవ్‌సైతం తన కుమారుణ్ణి పిలిచి కౌన్సెలింగ్‌ చేసినా చివరకు తేజ్‌ప్రతాప్‌ విడాకులకే మొగ్గుచూపించారు.